Bigg Boss : జంటగా బిగ్ బాస్ లోకి వెళ్లనున్న నాగ చైతన్య, శోభిత

Bigg Boss

Bigg Boss House Naga Chaitanya and Shobhita

Bigg Boss 8 Telugu : తెలుగు రియాలిటీ బిగ్ బాస్-8 సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభం కాగా.. అక్కినేని నాగార్జున మళ్లీ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఏకంగా 14 మంది కంటెస్టెంట్లు ఈసారి జంటగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అన్ని సీజన్ల కంటే ఈసారి ఊహించిన దానికంటే షో ఆసక్తికరంగా మారింది. ఇంట్లోకి అడుగుపెట్టిన తొలిరోజు నుంచే గొడవలు మొదలయ్యాయి. అందరూ మేమేం తక్కువ కాదన్నట్లు నువ్వా నేనా అన్న రేంజ్ లో  రెచ్చిపోతున్నారు. అప్పడే నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కావడానికి  కొందరి పేర్లు కూడా లిస్ట్ లోకి వచ్చాయి.

ఈ క్రమంలో.. తాజాగా ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ హౌస్ లోకి లవ్ బర్డ్స్ నాగ చైతన్య, శోభిత అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.  కంటెస్టెంట్లతో కలిసి మాట్లాడేందుకు వారిని టాస్కులు బాగా ఆడించే విధంగా ప్రోత్సహించేందుకు  హౌసులోకి రానున్నట్లు సమాచారం. దీనికోసం బిగ్ బాస్ మేకర్స్ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. గణేష్ చతుర్థి రోజున వారు వస్తారని అంతా ఫిక్స్ అయ్యారు. ఇది ఎంతవరకు నిజమో తెలియనప్పటికీ సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతుండటంతో.. తెలిసిన ప్రేక్షకులు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సమంతతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి నాగ చైతన్య యంగ్ బ్యూటీ శోభితతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వీరిద్దరూ వారి బంధం గురించి అధికారికంగా ఏనాడు స్పందించలేదు. ఆ పుకార్లను నిజం చేస్తూ ఆగస్టు 8, 2024న హైదరాబాద్‌లో శోభిత-చైతు  నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ ఫోటోలను నాగార్జున ట్విట్టర్‌లో షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులుగా శోభిత, నాగ చైతన్య పేర్లు, వారి వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వీరిద్దరూ రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం శోభిత, చైతూ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

TAGS