Nadendla Pulling Jagan Corruption : ఏపీలో వైఎస్ జగన్ సర్కారు అవినీతి, అక్రమాలను బయటకు లాగుతున్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఆయన రెండు రోజుల క్రితమే ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఆధారాలతో సహా ప్రభుత్వం అవినీతిని బయల పెడుతానని చెప్పారు. తాజాగా ఈ మేరకు కొన్ని విషయాలను వెల్లడించారు.
పిల్లలకు విద్యా కానుక పేరిట పథకంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. వైఎస్ జగన్ సర్కారు దీని వెనుక ఎంతో దోచుకుంటున్నదని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల ఈడీ పలు కంపెనీలపై దాడి చేసింది. అక్కడే ఈ కాంట్రాక్టుల విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో త్వరలోనే ఏపీలో ఈడీ దాడులు ఉండబోతున్నాయని చెప్పారు. దీంతో పాటు ఏపీలో ఇండోసోల్ కంపెనీకి ఇటీవల వేల ఎకరాల భూమిని కట్టబెట్టారు. ఇండోసోల్ కంపెనీ జగన్ రెడ్డి బినామీ కంపెనీ అనే విషయం కూడా వెలుగులోకి తెచ్చారు. ఈ కంపెనీ ప్రారంభించి ఏడాది కూడా కాకుండానే వేల ఎకరాలకు ఎలా కట్టబెడుతారని ప్రశ్నించారు. అయితే ఈ భూముల్ని పారిశ్రామిక విధానాన్ని కూడా మార్చి, నేరుగా సేల్ డీడ్ చేస్తున్నారు. తన బినామీ కంపెనీ కోసం ఇలాంటి మార్పును ప్రభుత్వం లో ఉండి సీఎం జగన్ చేసేశారని ఆయన ఆరోపించారు.
అయితే నాదెండ్ల బయటకు వెల్లడించిన విషయాలపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతున్నది. ఇక ప్రభుత్వం మారితే మాత్రం వీటన్నింటిపై మళ్లీ విచారణ ఖాయమని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. ప్రతిపక్ష నేతలపై జగన్ ప్రవర్తించిన తీరుకు బదులు తీర్చుకోక తప్పదని వారు అంటున్నారు. ఏదేమైనా మరో నాలుగు నెలల్లో ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరం చెప్పలేం. కానీ వైసీపీ నేతల వెన్నులో మాత్రం నాదెండ్ల వణుకు పుట్టిస్తున్నారు.