Nadendla Manohar : ‘సింగపూర్ లో పవన్ కుమారుడి హెల్త్ అప్టేట్ చెప్పిన నాదెండ్ల

Nadendla
Nadendla Manohar : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్‌లో జరిగిన ఒక ప్రమాదంలో గాయపడ్డారని నాదెండ్ల తెలిపారు. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో మార్క్ శంకర్ కూడా ఉన్నారు. ఆయనను కాపాడిన సిబ్బందికి నాదెండ్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు.
– ప్రమాదంపై పవన్‌తో మాట్లాడిన మోదీ
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ, పవన్ కుమారుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా, అవసరమైన సహాయం అందిస్తామని మోదీ పవన్‌కు హామీ ఇచ్చారు.