JAISW News Telugu

Naa Samiranga : ‘నా సామిరంగ’.. యూఎస్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

Naa Samiranga US Review

Naa Samiranga US Review

Naa Samiranga US Review : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈసారి పండుగ థియేటర్లలోనే అయ్యేట్టు ఉంది. నాలుగు ప్రతిష్ఠాత్మక సినిమాలు మూడు రోజుల వ్యవధిలో రావడంతో అంతటా సినీ కళ సంతరించుకుంది. ఇప్పటికే మూడు సినిమాల్లో జనాల్లోకి రాగా..నాగార్జున ‘నాసామిరంగ’ రేపు థియేటర్లలో సందడి చేయనుంది. ఇక ఇవాళ యూఎస్ఏ లో సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను కూడా స్టార్ట్ చేశారు. అక్కడ సినిమా చూసిన ఆడియన్స్ ఏం చెప్తున్నారు.. నాగ్ హిట్ కొట్టినట్టేనా? సంక్రాంతి విజేతగా నిలిచేనా? అనేది ఒకసారి చూద్దాం..

అసలేంటి కథ..

ముందుగా సినిమా కథ విషయానికొస్తే ఒక ఊరిలో నాగార్జున ఆడుతూ పాడుతూ జాలీగా ఏ బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు. అలాంటి నాగార్జునకు కొంత మంది గ్రామ పెద్దమనుషులతో గొడవ జరుగుతుంది. ఇక ఇదే క్రమంలో తన ఫ్రెండ్స్ అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ లతో కలిసి సందడి మాములుగా ఉండదు. నాగార్జున బ్యాచ్ చేసిన ఓ పని వల్ల పెద్దమనుషులకు నష్టం జరుగుతుంది. దీంతో నాగ్ బ్యాచ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని, వీళ్లని చంపేయాలని పెద్ద మనుషులు చూస్తారు. ఇక నాగార్జున తన స్నేహితులను ఎలా కాపాడుకుంటాడో అనేదే సినిమా.

ఎవరెలా చేశారు..

ఈ సినిమా డైరెక్టర్ విజయ్ బిన్ని బేసిగ్గా కొరియోగ్రాఫర్. ఆయనను నమ్మి నాగార్జున దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పాడు. నాగ్ ఆశలను వమ్ము చేయకుండా విజయ్ బిన్ని కథను తెరకెక్కించాడు. ఎమోషన్స్, కామెడీ, ఎక్కడెక్కడ ఎలివేషన్స్ ఇవ్వాలో సరిగ్గానే చేశాడు. హీరోను ఫుల్ ప్లేడ్జ్ గా వాడుకుంటూ అద్యంతం సినిమాను ఫుల్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాడు. నాగార్జునతో చేయించిన యాక్టింగే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యిందని తెలుస్తోంది. నాగ్, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కామెడీ కూడా బాగా పండింది. ఎమెషన్ సీన్లను ఇరుగదీశారనే చెబుతున్నారు. హీరోయిన్ ఆషికా సినిమాకు అస్సెటే అని చెప్పాలి.  మంచి అందం, అభినయంతో ఆకట్టుకుంది. కాకపోతే అక్కడక్కడ కొన్ని సీన్లు బాగా లాగ్ అయ్యాయి. కొన్ని సీన్లు అనవసరంగా చొప్పించినట్టు అనిపిస్తుంది.

టెక్నికల్ గా..

త్రిపుల్ ఆర్ తర్వాత కీరవాణి చేసిన మూవీ ఇది. సాంగ్స్ ఫర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి. బీజీఎం కూడా రాజమౌళి స్థాయిలో కాకున్నా ఉన్నంతలో బాగానే ఇచ్చాడు. కొన్ని సీన్లు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే హైలెట్ గా నిలిచాయి. సినిమాటోగ్రాఫర్ పల్లె నెటివిటీని అద్భుతంగా తెరకెక్కించాడు. సంక్రాంతి పందెంకోడిలా సినిమా విజివల్స్ అద్దిరిపోయాయనే చెప్పాలి.

మొత్తానికి సినిమా బాగా ఉందనే చెబుతున్నారు. కాగా, ఇప్పటికే రిలీజైన గుంటూరు కారం, సైంధవ్ మిక్స్ డ్ టాక్  తెచ్చుకున్నాయి. హనుమాన్ బ్లాక్ బస్టర్  టాక్ సొంతం చేసుకుంది. ఇక రేపు థియేటర్లలోకి రానున్న నా సామిరంగ హిట్ టాక్ ఖాయం. అంటే ఈ సంక్రాంతి రేసులో హనుమాన్, నా సామిరంగ ముందంజలో ఉన్నట్టే.

Exit mobile version