JAISW News Telugu

Naa Sami Ranga : ఓటీటీ లోకి ‘నా సామి రంగ’ చిత్రం.. ఇంత తొందరగా రావడానికి కారణం అదేనా!

Naa Sami Ranga

Naa Sami Ranga into OTT

Naa Sami Ranga into OTT : అక్కినేని నాగార్జున హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘నా సామి రంగ’ బాక్స్ ఆఫీస్ వద్ద రీసెంట్ గానే విడుదలై మంచి కమర్షియల్ సక్సెస్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. నాగార్జున నుండి ఒక్క కమర్షియల్ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ సినిమా ఒక పండగనే తీసుకొచ్చింది. పండగ సెలవుల్లో దంచి కొట్టేసిన ఈ సినిమా, ఇప్పటికీ పలు ప్రాంతాలలో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పటికే 20 కోట్ల రూపాయిల షేర్ మార్కు ని దాటేసింది కానీ, ఇంకా దాదాపుగా అన్నీ ప్రాంతాలలో క్లోసింగ్ వేసేసుకోవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఒక్క ఉత్తరాంధ్ర మినహా, ఏ ప్రాంతం లో కూడా ఈ సినిమాకి ప్రస్తుతం షేర్ వసూళ్లు రావడం లేదట. మహా అయితే ఇంకో కోటి రూపాయిలు షేర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ డిజిటల్ రైట్స్ ని డిస్నీ + హాట్ స్టార్ సంస్థ ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో డిజిటల్ రైట్స్ రీసెంట్ సమయం లో అత్యధిక రేట్ కి అమ్ముడు పోయిన ఏకైక చిత్రం ఇదేనట. రవితేజ ‘ఈగల్’ సినిమాకి ఇప్పటి వరకు డిజిటల్ రైట్స్ కొనుగోలు చెయ్యలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు ఓటీటీ సంస్థలకు లాభాలు రావడం లేదు. నా సామి రంగ డిజిటల్ రైట్స్ ఓటీటీ సంస్థలు మంచి లాభాల్లో ఉన్నప్పుడు కొనుగోలు చేసారు. ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని మార్చి రెండవ వారం వరకు స్ట్రీమింగ్ కి అనుమతి లేదు.

కానీ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా చివరి దశకి చేరుకుంది కాబట్టి ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేసేందుకు డిస్నీ + హాట్ స్టార్ వారు మేకర్స్ ని రిక్వెస్ట్ చేశారట. అలా చెయ్యనిస్తే ముందు అనుకున్న రేట్ కంటే అదనంగా మరో 5 కోట్ల రూపాయిలు ఇస్తామని అన్నారట. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Exit mobile version