Naa Saami Ranga : గత కొంత కాలం నుండి స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున రేంజ్ లో ఫ్లాప్ సినిమాలను ఎవ్వరూ చూడలేదనే చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్ లో మన టాలీవుడ్ కి గుర్తింపు తీసుకొచ్చిన మా హీరో, ఇప్పుడు మార్కెట్ మొత్తం కోల్పోయే పరిస్థితికి వచ్చేశాడే అని అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కొంత మంది అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అయితే థియేటర్ కి వెళ్లి నాగార్జున సినిమాలను చూడడమే మానేశారు.
ఆ రేంజ్ ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. అలాంటి సమయం లో అభిమానులు నాగ్ నుండి ఒక్క కమర్షియల్ మాస్ సినిమాని కోరుకున్నారు. మధ్యలో ‘బంగార్రాజు’ చిత్రం తో భారీ హిట్ ని నాగార్జున అందుకున్నాడు కానీ, అది పూర్తి స్థాయి సంతృప్తి పర్చలేదు. అభిమానుల ఆకలి తీర్చే సినిమా కోసం ఎదురు చూస్తున్న సమయం లో ‘నా సామి రంగ’ ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. కేవలం రెండు నెలల్లో షూటింగ్ ని పూర్తి చేసి నేడు భోగి సందర్భంగా విడుదల చేసాడు.
సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ మరియు పాటలు ఆకట్టుకొని అంచనాలను పెంచాయి. నాగార్జున నుండి ఈసారి పక్కా హిట్ రాబోతుంది అనే నమ్మకం ఫ్యాన్స్ లో కలిగింది. ఆ నమ్మకాన్ని నేడు నిలబెట్టుకున్నాడు నాగార్జున. నేడు విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. సంక్రాంతికి ఇది కదా అసలు సిసలు సినిమా అంటే అని నాగ్ ఫ్యాన్స్ తో పాటుగా, ప్రేక్షకులు కూడా చెప్పుకొచ్చారు. టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. 8 ఏళ్ళ తర్వాత నాగార్జున కి ప్రధాన నగరాల్లో బెన్ఫిట్ షోస్ ఫుల్ అవ్వడం వంటివి జరిగాయి. అభిమానులు దీనికి ఎంతో సంతోషించారు. ఎందుకంటే నాగార్జున రీసెంట్ సినిమాలు కొన్ని సంపూర్ణేష్ బాబు సినిమా మొదటి రోజు రాబట్టినంత ఆక్యుపెన్సీ ని కూడా రాబట్టలేని పరిస్థితులు వచ్చాయి. అంతటి స్లంప్ ఫేస్ నుండి ఈ రేంజ్ కం బ్యాక్ ఇవ్వడం సాధారణమైన విషయం కాదు.
ఇది ఇలా ఉండగా ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుండి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందట. సంక్రాంతికి హనుమాన్ చిత్రం తర్వాత జనాలకు ఈ సినిమానే ఛాయస్ కాబట్టి, ఇదే రేంజ్ ఊపుని వారం రోజులు కొనసాగిస్తే 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు