JAISW News Telugu

Naa Saami Ranga : ‘నా సామి రంగ’ 5 రోజుల వసూళ్లు..ఓవర్సీస్ లో ‘గుంటూరు కారం’ నే దాటేసింది!

Naa Saami Ranga

Naa Saami Ranga movie 5days collections

Naa Saami Ranga : వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలతో కెరీర్ ముగించుకునే రేంజ్ కి వచ్చేసిన నాగార్జున, ఆయన అభిమానుల కోసం ఒక పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా అయినా ‘నా సామి రంగ’ చిత్రం తో జనవరి 14 వ తేదీన మన ముందుకు వచ్చాడు. విడుదలకు ముందే మంచి పాజిటివ్ బజ్ ని ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా , విడుదల తర్వాత కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. సంక్రాంతికి అసలు సిసలు మాస్ సినిమాగా టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి థియేటర్స్ సమస్య వచ్చింది.

అనేక ప్రాంతాలలో ‘గుంటూరు కారం’ చిత్రానికి డిమాండ్ లేకపోయినప్పటికీ కూడా థియేటర్స్ ని హోల్డ్ చెయ్యడం ఈ సినిమాకి థియేటర్స్ దక్కకపోవడానికి ఒక కారణం అయితే, ‘హనుమాన్’ చిత్రం మరో వైపు వసూళ్ల సునామి ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్లడం కూడా మరో కారణం. అయితే దొరికినన్ని థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం 5 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 5 రోజులకు ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 18 కోట్ల రూపాయలకు జరిగింది. సోలో రిలీజ్ కాదు కాబట్టి, నాగార్జున కి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం తో ఇంత తక్కువ మొత్తం లో ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ని కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో రికవరీ అయ్యే రేంజ్ కి వచ్చిందంటే, ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ సినిమాకి మొదటి వారం 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టేసిన ఈ సినిమా ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతాలలో డిజాస్టర్ రేంజ్ వసూళ్లు వచ్చాయి.

కానీ నిన్న అమెరికా లో ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ కంటే ఎక్కువ వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అతి తక్కువ లొకేషన్స్ లో విడుదల చెయ్యడం వల్లే ఈ సినిమా ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవ్వడం లేదని. లేకుంటే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యేదని నాగార్జున ఫ్యాన్స్ చెప్తున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కచ్చితంగా రాబడుతుందని నాగార్జున ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version