JAISW News Telugu

Prashanth Neel:ప్ర‌శాంత్ నీల్‌తో మైత్రి నెక్ట్స్ లెవ‌ల్ యాక్ష‌న్ మూవీ?

Prashanth Neel:సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో త‌ళా అజిత్ ఒకరు. సౌతిండియాలో ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అంత‌టివాడు అత‌డు. ఇటీవ‌ల ఆయ‌న సినిమాల‌న్నీ మంచి విజ‌యాలు సాధిస్తున్నాయి. ప్రస్తుతం అజిత్ తన 62వ సినిమాలో నటిస్తున్నాడు. దీనికి విడమూర్చి అనే టైటిల్ కూడా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మగిల్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తుండగా, అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే అజిత్ తన తదుపరి చిత్రాలను వరుసగా కమిట్ చేస్తున్నాడని తాజా సమాచారం. ఇంత‌లోనే త‌ళా అజిత్ కోసం తెలుగు నిర్మాణ సంస్థ మైత్రి ప్ర‌య‌త్నాలు ఫిలింన‌గ‌ర్ లో హాట్ టాపిక్ గా మారాయి.

విడముయార్చి పూర్తి చేసిన తర్వాత అజిత్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఆయనకు 63వ సినిమా. కాగా, అజిత్ తన 64వ చిత్రాన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌లో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా తన 65వ చిత్రానికి దర్శకుడిని ఫిక్స్ చేసినట్లు తాజా సమాచారం. అతడు మరెవరో కాదు, లేటెస్ట్ క్రేజీ డైరెక్టర్లలో ఒకరైన ప్రశాంత్ నీల్. కెజిఎఫ్‌తో తన సత్తా ఏంటో నిరూపించుకుని పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారి ఇటీవలే సాలార్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు.

ప్రశాంత్ నీల్ ని అవకాశాలు వెంటాడుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే టాలీవుడ్‌లో విజయవంతమైన బ్యానర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. మైత్రి మూవీ మేకర్స్ అజిత్ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కేజీఎఫ్ 3, సలార్ 2 సినిమాలు చేయాల్సి ఉంది. అదేవిధంగా టాలీవుడ్ స్టార్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ సినిమాని మైత్రి సంస్థ మ‌రో లెవ‌ల్లో తెర‌కెక్కించేందుకు స‌న్నాహకాల్లో ఉంద‌ని స‌మాచారం.

తాజాగా ఈ దర్శకుడిపై అజిత్ కన్నేసినట్లు సమాచారం. తనతో సినిమా చేయమని దర్శకుడు ప్రశాంత్ నీల్‌ని స్వయంగా అడిగాడనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ న‌టించే 65వ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావడానికి ఇంకా చాలా సమయం ఉంది.

Exit mobile version