JAISW News Telugu

Mylavaram Assembly Constituency : మైలవరం బరిలో వసంత, వంశీ ఫిక్స్?

Mylavaram Assembly Constituency : ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న  కొద్దీ రాజకీయ వేడి రాజుకుంటోంది. అన్ని నియోజకవర్గాల్లో కెల్లా కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే టీడీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ టచ్ లోకి వెళ్లిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య టఫ్ ఫైట్ ఉంది. టికెట్ నాది అంటే నాది అంటూ పోటీ పడి ప్రకటనలు చేసుకుంటున్నారు.

అయితే మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ దాదాపు ఖాయమైనట్టే అనే వార్తలు వస్తున్నాయి. ఇదే విషయమై మైలవరంలో పోటీ చేయడానికి తనకు టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ వసంత కృష్ణ ప్రసాద్  నియోజకవర్గ నేతలకు ఫోన్లు చేస్తున్నట్లు  సమాచారం. అభిప్రాయ బేధాలు ఉంటే కలిసి మాట్లాడుకుందాం అని చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే వసంత రాకను దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు వ్యతిరేకిస్తున్నారు. దీంతో వారిద్దరితో చర్చలు జరిపేందుకు టీడీపీ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ మైలవరం, పెనుమలూరు సీట్లను పెండింగ్ లో పెట్టడంతో రెండు చోట్ల పాలిటిక్స్ హైవోల్టేజీతో సాగుతున్నాయి.  అయితే మైలవరం నుంచి వసంత దాదాపు ఫిక్స్ అయినట్టే అని తెలుస్తోంది.

ఇక వైసీపీ నుంచి వల్లభనేని వంశీ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. గతంలో వైసీపీ ఆరో జాబితా విడుదల చేసినప్పుడు మైలవరం ఇన్ చార్జిగా తిరుపతిరావు యాదవ్ ను నియమించింది. అయితే మారిన పరిణామాలతో వల్లభనేని వంశీని బరిలోకి దించాలని వైసీపీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో మైలవరం రాజకీయాలు ఉత్కంఠను రేపాయి. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్టే కనిపిస్తుండడంతో అంతా ప్రచార బరిలోకి దూకనున్నారు.

Exit mobile version