Sandeep Vanga : ‘ఎనిమల్’ చిత్రం నా భార్యకే నచ్చలేదు..ఇక వాళ్లకి ఎలా నచ్చుతుంది : సందీప్ వంగ
Sandeep Vanga : ప్రస్తుతం ఇండియా మొత్తం బోల్డ్ దర్శకుడు సందీప్ వంగ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒకే మూసలో వెళ్తున్న సినిమా స్థితి గతులను మన తెలుగు డైరెక్టర్ మార్చేశాడు అని టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ లో ఈ చిత్రం ఏకంగా 900 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.
మ్యాజిక్ ఫిగర్ 1000 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి ఉంటే చాలా బాగుండేది, కానీ సలార్,డుంకీ చిత్రాల కారణంగా ఆ మార్కుని అందుకోలేకపోయింది. ఇదంతా పక్కన పెడితే థియేట్రికల్ వెర్షన్ కి యూత్ ఆడియన్స్ లో ఈ సినిమాకి కల్ట్ స్టేటస్ రాగ, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాని చూసి బండ బూతులు తిట్టుకున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ వెర్షన్స్ లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.
ఒక పాపులర్ హిట్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఓటీటీ లోకి వచ్చినప్పుడు సహజంగానే చూస్తారు. అలా ఈ సినిమాని కూడా చూసారు, వాళ్ళ నుండి రెస్పాన్స్ చాలా దారుణంగా వచ్చింది. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం సోషల్ మీడియా లో సందీప్ వంగ ని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా రీసెంట్ గా సందీప్ వంగ ఒక ప్రముఖ బాలీవుడ్ యూట్యూబ్ ఛానల్ కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ సందీప్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఈ సినిమాని మీ మూడేళ్ళ చిన్న కొడుకుకి చూపించగలరా’ అని అడగగా, సందీప్ దానికి సమాధానం చెప్తూ ‘వాడు దానిని చూడకూడదు అనే బోల్డ్ సన్నివేశాలన్నీ కట్ చేసి, సెపెరేట్ గా ఒక వెర్షన్ ని హార్డ్ డిస్క్ లో పెట్టాను. గోవాలో న్యూ ఇయర్ సందర్భంగా నా కొడుకు అర్జున్ రెడ్డి కి ఈ వెర్షన్ వేసి చూపించాను, వాడికి చాలా బాగా నచ్చింది. అండర్ వేర్ యాక్షన్ సన్నివేశాలను బాగా ఎంజాయ్ చేసాడు. కానీ నా భార్య కి మాత్రం ఈ సినిమా నచ్చలేదు, రక్త పాతం సన్నివేశాలను ఆమె చూడలేదు..నా భార్య నుండే అలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే, ఇక బయట లేడీస్ నుండి అలాంటి రెస్పాన్స్ రావడం లో తప్పు లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.