Actress Hema : నీ పేరు అంటే నా పేరు హేమ.. కాదు కృష్ణవేణి. మీరు ఎక్కడి వారు అంటే నేను ఇక్కడి అమ్మాయినే.. కాదు మాఊరు హైదరాబాద్. ఎంటీ ఈ డొంక తిరుగుడు సమాధానాలు అనుకుంటున్నారా..? ఇవన్నీ ఎవరో చెప్పినవి కాదు.. ఇవి నటి హేమ పోలీసుల విచారణలో చెప్పిన సమాధానాలు. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన తర్వాత నటి హేమ ఇలాంటి సమాధానాలే ఇచ్చిందని బెంగళూరు పోలీసులు అంటున్నారు.
ఆదివారం రాత్రి బెంగళూరులో రేవ్ పార్టీలో పలువురు టాలీవుడ్ నటులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పార్టీపై మే 20వ తేదీ సోమవారం తెల్లవారు జామున పోలీసులు దాడి చేసి దాాపు 103 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో ప్రముఖ పటి హేమ పాల్గొన్నట్లు వార్తలు రాగా.. వాటిని ఆమె ఖండించారు. అయితే, రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. కాగా, బెంగళూరు రేవ్ పార్టీపై హెబ్బగోడి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. రేవ్ పార్టీలో ఆరుగురిపై కేసు నమోదైంది.