Supritha : ‘మా అమ్మకు రెండో పెళ్లి చేస్తా..’ ‘వరుడు అలా ఉండాంటే’!!

Supritha

Supritha

Supritha : జీవితంలో ప్రతీ ఒక్కరికీ తోడు అవసరం. శరీరం సహకరించిన సమయంలో ఏ మాత్రం అవసరం అనిపించదు. కానీ శరీరం కృషించుకుపోతున్న సమయంలో తోడు తప్పని సరి, పైగా ముసలితనం రాకముందు వారికైతే సెక్స్ కోరికలు కూడా ఉంటాయి. వీటిని తీర్చేందుకు కూడా పార్ట్నర్ అవసరం.

కొంత మంది తమకు పుట్టిన పిల్లలను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తారు. ఇలా ఎక్కువగా ఆడవారు ఉంటారు. అదే మగవారు అయితే తోడు తప్పనిసరి అవుతుంది. ఇవన్నీ పక్కన పెడితే.. ఇండస్ట్రీలో సురేఖా వాణి గురించి తెలిసే ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ స్థిరపడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె భర్త చనిపోయిన సమయంలో ఆమెకు కూతురు సుప్రీత ఉంది. ఆమెను చూసుకుంటూనే సురేఖా వాణి వివాహం చేసుకోలేదు.

అయితే, ఇటీవల ఆమె కూతురు సుప్రీత తన తల్లికి పెళ్లి చేస్తానంటూ చెప్పుకస్తుంది. అది కూడా త్వరలో చేస్తానని చెప్తుంది. ఇటీవల ఒక షోకు వెళ్లిన సుప్రీత తన తల్లికి సెకండ్ మ్యారేజ్ చేస్తానని చెప్పింది. వరుడి కోసం వెతుకుతున్నానని, అబ్బాయిలు అయితే సెట్ కారని, అంకుల్స్ అయితే సరిపోతారని సెటైరికల్ గా చెప్తోంది. వివాహం తర్వాత అమ్మను బాగా చూసుకోవాలని, టాక్సిక్ గా ఉండద్దని చెప్పుకొచ్చింది. అలాంటి వారు ఉంటే పెళ్లి చేస్తా అని చెప్పింది. తన గురించి చెప్తూ.. ‘గతంలో ఓ అబ్బాయిని ప్రేమించాను, కానీ టార్చర్ చేశాడని వదిలిపెట్టాను’ అని తెలిపింది. ప్రస్తుతం పెళ్లిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలో తీసుకోబోవచ్చని చెప్పుకచ్చింది.

TAGS