Raj Tarun : తిండి లేక ఇబ్బందులు పడుతున్నా..రాజ్ తరుణ్ కోసమే నా పోరాటం : లావణ్య
Raj Tarun : ప్రస్తుతం రాజ్ తరుణ్ లావణ్య ప్రేమాయణం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. వీరి వ్యవహారంలో రోజుకో కొత్త ట్విస్ట్ బయటకు వస్తోంది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని ఇటీవల వెల్లడించిన నటి లావణ్య.. ప్రతీ రోజూ కొత్త విషయాలను చెబుతున్నారు. తమకు ఇప్పటికే పెళ్లయిందని, 11ఏళ్లుగా ఇద్దరం కలిసే ఉంటున్నామని.. ఓసారి తనకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడనే ఇటీవలే షాకింగ్ విషయాలను ఆమె వెల్లడించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా వల్లే తనను రాజ్ తరుణ్ వదిలేశాడని లావణ్య ఆరోపించారు. ప్రస్తుతం ఈ వివాదంపై హైడ్రామా నడుస్తోంది. ఈ తరుణంలో ప్రెస్‍మీట్‍లో మరిన్ని విషయాలను వెల్లడించారు.
రాజ్ తరుణ్‍తో ఉండాలని తాను కోరుకుంటున్నానని లావణ్య మరోసారి మీడియా ముందు స్పష్టం చేశారు. అతడితో కలిసి జీవితం కొనసాగించాలనే ఉద్దేశంతోనే తాను ఈ పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. “ఈ ప్రపంచంలో నాకు అన్నింటికంటే రాజ్ ఎక్కువ. వస్తాడో రాడో తెలియదు. నా ప్రేమ నిజమైతే వస్తాడనే ఓ ఆశతో ఉన్నాను. అయితే ఈ క్రమంలో నాకు ఎదురవుతున్న పరిస్థితుల పట్ల చాలా బాధగా ఉంది” అంటూ లావణ్య చెప్పుకొచ్చారు. మాల్వీ మల్హోత్రా వల్లే తనను రాజ్ తరుణ్ వదిలేశాడని లావణ్య మళ్లీ చెప్పారు. తమ కుటుంబం నుంచి రాజ్ తరుణ్ విడతల వారిగా రూ.70లక్షలు తీసుకున్నాడంటూ చెప్పారు. ఎప్పుడైనా అవసరం వచ్చి డబ్బు అడిగితే.. మాల్వీ చెబితేనే తనకు పంపేవాడని లావణ్య వెల్లడించారు. తాను ప్రస్తుతం తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చాలా మంది బెదిరిస్తూ టార్గెట్ చేస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు లావణ్య తెలిపారు. తాను చేస్తున్న ఆరోపణలకు అన్ని ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.
తన కుమార్తెకు రాజ్ తరుణ్‍తో పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, కానీ అతడు సాగదీస్తూ వచ్చాడని లావణ్య తండ్రి చెప్పారు. లావణ్యకు బెదిరింపులు వస్తున్నాయంటూ వెల్లడించారు. మాల్వీతో పాటు అతడి సోదరుడు మయాంక్ కూడా లావణ్యను బెదిరించారని ఆమె తరఫున న్యాయవాది వెల్లడించారు. 2008లోనే రాజ్ తరుణ్, లావణ్యకు పరిచయం ఏర్పడందని, 2014లోనే పెళ్లి అయిందని కూడా ఫిర్యాదులో తెలిపినట్టు పేర్కొన్నారు. డబ్బు కోసమే లావణ్య ఇలా రచ్చ చేస్తున్నారని రాజ్ తరుణ్ మరోవైపు విమర్శిస్తున్నారు. తాము కొంతకాలం కలిసి ఉన్న మాట నిజమేనని, కానీ పెళ్లి చేసుకుంటానని తాను ఎప్పుడూ చెప్పలేదని వెల్లడించారు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని కూడా ఆరోపించారు. రాజ్‍తరుణ్, మాల్వీ మల్హోత్రాపై నార్సింగి పోలీస్ స్టేషన్‍లో లావణ్య ఫిర్యాదు చేశారు.