Renu Desai : నా కుమార్తె కన్నీళ్లు, ఉసురు తప్పకుండా తగులుతుంది. రేణు దేశాయ్
Renu Desai : రేణు దేశాయ్ మళ్లీ ఎమోషనల్ అయిపోయింది. పవన్ కల్యాణ్ నుంచి విడాకులు తీసుకుని పిల్లలతో కలిసి వేరుగా ఉంటున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం ఇప్పటికీ ఆమెను వదిన అనే పిలుచుకుంటారు. అయితే పవన్ కల్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా పవన్ తన పిల్లలు, అఖిరా నందన్, ఆద్య, భార్య అన్నా లెజొనోవాతో కలిసి మంగళగిరిలోని క్యాంపు ఆఫీసుకు వెళ్లే సమయంలో భారీగా ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. దీంతో పవన్ కారు దిగి కాసేపు సరదాగా బయట తిరిగారు. ఆ సమయంలో భార్య అన్నా , పిల్లలు ఆద్య, అఖిరా నందన్ తో కలిసి ఒక ఫొటో దిగారు. దీన్ని జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
దీంతో ఈ ఫొటో పై అనేక మంది కామెంట్లు చేశారు. కొంతమంది మాత్రం దీనిపై మీమ్స్ చేశారు. అన్నా స్థానంలో రేణు దేశాయ్ ను ఉంచడం, వల్గర్ గా మీమ్స్ చేయడం, పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడం మొదలెట్టారు. దీంతో రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రాం వేదికగా స్పందించింది. ప్రముఖుల వ్యక్తుల అకౌంట్లను యాక్సెస్ చేసి విచక్షణ మరిచి పోస్టులు చేస్తున్న వారికి ఒక్కటే చెబుతున్నా.. మీకు కూడా కుటుంబం ఉండే ఉంటుంది. మీకు అక్కా చెల్లెళ్లు, అమ్మ ఉంటుంది. వారు బాధపడితే తెలుస్తుంది.
నా కూతురు మీరు చేసిన మీమ్స్ వల్ల ఎంత వెక్కి వెక్కి ఎడ్చిందో తెలుసా.. మీరు అంతకంటే ఎక్కువ అనుభవిస్తారు. నా కుమార్తె కన్నీళ్లే మీకు శాపంగా మారి, ఉసురు తగులుందని చెప్పింది. ఇలాంటి పోస్టు చేయకూడదని అనుకున్నా.. వంద సార్లు ఆలోచించా కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్న.. నా కుమార్తె, ఆమె అనుభవించిన బాధను దృష్టిలో ఉంచుకుని పోస్టు చేస్తున్నాను అంటూ చెప్పింది.