Buffalo : తన గేదెను కొందరు దుండగులు రేప్ చేశారని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా తోకలపూడి గ్రామానికి చెందిన సీతారామయ్య అనే రైతు తన గేదె కాళ్లని తాడుతో కట్టేసి గంజాయి, మద్యం సేవించిన యువకులు అత్యాచారం చేశారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. గేదె ఒంటిపై గోళ్లతో గీరిన గాయాలను గుర్తించాడు. దీనిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు.
కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు వెటర్నరీ డాక్టర్ తో వైద్య పరీక్షలు నిర్వహించారు. గేదెపై అత్యాచారం చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని సీతారామయ్య డిమాండ్ చేశాడు.