Viral Video : మూస్తడు..ఏస్తడా..ఈసారి మేం మూసేస్తం గా.. జగన్ పై పిచ్చ కామెడీ వీడియో..
Viral Video : ఏపీ ఎన్నికల పోలింగ్ కు మరో పది రోజులే ఉంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్తూనే ప్రత్యర్థి పార్టీలను ఏకిపారేస్తున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారాలే కాదు సోషల్ మీడియాను విపరీతంగా వాడేసుకుంటున్నాయి పార్టీలు. ఓ రకంగా చెప్పాలంటే ఏపీ ఎన్నికల సమరం సోషల్ మీడియాలోనే ఫుల్లుగా సాగుతుందని చెప్పవచ్చు. ఈనేపథ్యంలో టీడీపీ కూటమి సోషల్ మీడియాలో జగన్ పాలనపై సెటైర్లు, ఆయన పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నారు. ఈ సందర్భంగా షార్ట్ వీడియోలు జనాలను విపరీతంగా అలరిస్తున్నాయి. జగన్ పాలనపై సెటైరికల్ వీడియోలైతే జనాలను కడుపుబ్బా నవ్వించడమే కాదు ఆలోచింపజేస్తున్నాయి. తాజాగా ‘వాహనమిత్ర’ పథకంపై ఆటో డ్రైవర్ల అంతరంగం ఎలా ఉందో చాటిచెప్పే వీడియో ఒకటి అదుర్స్ అనే చెప్పాలి. జగన్ పేరడీ క్యారెక్టర్ కు, ఓ ఆటో డ్రైవర్ కు మధ్య సంభాషణ తెగ నవ్విస్తోంది.
అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ ను ఆపి తమ్ముడు ఎలా నడుస్తుందిరా ఆటో అంటూ జగన్ పేరడీ క్యారెక్టర్ ప్రశ్నిస్తాడు. దానికి ఆటోడ్రైవర్ ‘‘ మీ ప్రభుత్వం లాగే..భళిరా భళి భళిరా..ముందుకెళ్లట్లే..’’ అంటాడు. దానికి జగన్ ఎందుకురా అని ప్రశ్నిస్తాడు. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెంచావుగా అని ఆటో డ్రైవర్ అంటే..జగన్ క్యారెక్టర్ ‘‘ఎందుకురా మీ ఆటో వాళ్ల కోసం వాహనమిత్ర పెట్టాను కదరా..బంపర్ ఆఫర్’’ అంటూ గొప్పలకు పోతాడు. దానికి ఆటో డ్రైవర్ ఆటో నుంచి కిందికి దిగుతూ..‘‘ఏంది బంపర్ ఆఫరా..నువ్వు ఇచ్చిన ఆఫర్ కు రోడ్డు మీది నుంచి వెళ్తుంటే బంపర్ ఊడిపోతోంది..’’ ఆటో డ్రైవర్ సమాధానం ఇస్తాడు.
ఇలా సాగిన వీడియో చివర్లో జగన్ క్యారెక్టర్ పక్కనున్న ‘‘అన్నా లచ్చలకు లచ్చలు అప్పులు తెత్తాండు..ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేదు..స్విస్ బ్యాంకులో దాస్తుండు.. ప్రశ్నిస్తున్న వారిని మూసేస్తండు..ఏసేస్తండు’’ అని అనగానే..ఆటో డ్రైవర్ సమాధానమిస్తూ ..‘‘మూస్తడు..ఏస్తడా..ఈసారి మేం మూసేస్తం..’’ గా అంటాడు. అలా ముగుస్తుంది వీడియో. కడుపుబ్బా నవ్వించే వీడియోను మీరు కూడా ఓసారి లుక్కేయండి మరి.