Krosur : క్రోసూరు మండల కేంద్రంలో ఆదివారం అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ మండలాల ముస్లిం మైనారిటీ ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సతీమణి భాష్యం లావణ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ముస్లింలను ఉద్దేశించి మాట్లాడారు.
టీడీపీ హయాంలో ఉర్దూ వర్సిటీని హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. హజ్ హౌజ్ నిర్మించి పలువురిని మక్కా పంపించారని, కడప, విజయవాడలో హజ్ హౌస్ లు నిర్మించినట్లు చెప్పారు. వైసీపీ పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, నూర్జహాన్, మూడు మండలాల ముస్లిం మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదర సోదరీమణులు పాల్గొన్నారు.