JAISW News Telugu

Inspiring story : ముస్లింలు కూడా హిందూ దేవాలయాలకు వెళ్తారు.. కశ్మీర్ లో ఆలయం కోసం భూమిని దానం చేసిన ఓ స్ఫూర్తి కథ

Inspiring story

Inspiring story in Jammu and Kashmir

Inspiring story : దేశంలో రాజకీయ నాయకులు మతం పేరుతో ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నాలు చేసుకుంటారు. కానీ కొన్ని చోట్ల మతసామరస్యం వెల్లివిరిస్తుంది.  జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని రిచ్వా గ్రామంలోని ముస్లిం కుటుంబాలు గ్రామంలో ఉన్న శతాబ్దాల నాటి హిందూ దేవాలయాన్ని నిర్వహిస్తూ మత సామరస్యానికి ఉదాహరణగా నిలిచాయి. అలాగే అక్కడ ముస్లింలు హిందూ ఆలయాలను సందర్శించుకుంటారు. పూజలు నిర్వహిస్తారు. అంతే కాకుండా వారు ఏకంగా హిందూ ఆలయం కోసం ముస్లింలు తమ భూమిని దానం ఇచ్చి.. మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేవారికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్‌లోనే చోటుచేసుకుంది. కశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని పురాతన హిందూ ఆలయం కోసం ఇద్దరు ముస్లింలు తమ సొంత భూమిని దేవుడి కోసం విరాళంగా ఇచ్చారు. ఖేరల్ పంచాయతీకి చెందిన గులాం రసూల్, గులాం మహ్మద్ తమ స్థలాన్ని పంచాయతీకి రాసిచ్చారు.

కాన్సీపట్టా గ్రామంలో గౌరీ శంకర్ ఆలయం కోసం సుమారు కోటి రూపాయల అంచనా వ్యయంతో 10 అడుగుల వెడల్పుతో 1200 మీటర్ల రోడ్డు నిర్మించాలని భావించారు. అయితే, ఆ మార్గంలో రసూల్, మహ్మద్‌లకు చెందిన వ్యవసాయ భూమి ఉంది. దీంతో గ్రామ పెద్దలు వారిని సంప్రదించగా.. తమ భూమిని రహదారి నిర్మాణానికి ఇవ్వడానికి ఒప్పుకున్నారు.  స్థల సేకరణ కోసం పంచాయతీ సభ్యులు, రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమ భూమిలో కొంత భాగాన్ని రహదారికి ఇచ్చేందుకు వీరు అంగీకరించారు. పంచాయతీ నిధులతో  నిర్మాణ పనులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. రహదారి సమస్యను సాకుగా చూపి సమాజంలో విద్వేషాలను రెచ్చగొటేందుకు ఆ ప్రాంతంలో కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆలయానికి రహదారి లేకపోవడంతో మత కల్లోలానికి ప్రయత్నించారు.  కాగా, ఆలయాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో మరికొంత భూమి ఆలయం పేరుమీద ఉంది.

Exit mobile version