Music Shop Murthy : ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ట్రైలర్: స్ఫూర్తిదాయకమైన కథ!

Music Shop Murthy
Music Shop Murthy : అజయ్ ఘోష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా స్టార్ హీరోలతో నటిస్తూ భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే తను కథానాయకుడిగా కొత్త చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’తో అరంగేట్రం చేస్తున్నాడు. చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ‘ఫ్లై హై సినిమాస్’ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ ఫుల్సమ్ ఎంటర్టైనర్కు శివ పాలడుగు దర్శకత్వ బాధ్యతలు వహిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కథ గురించి కొంత వివరిస్తుంది. అసలు ఏముందంటే ఇది DJ కావాలని కలలు కనే మ్యూజిక్ షాప్ యజమాని (అజయ్ ఘోష్) చుట్టూ తిరిగే కథ. చాలా మంది అతన్ని గేలి చేస్తారు. తన భార్యతో సహా ప్రతీ ఒక్కరూ అజయ్ ఘోష్ గురించి వింతగా మాట్లాడుకుంటారు. అతను DJ కోర్సు చేసేందుకు నగరంలోకి వచ్చినప్పుడు అసలు స్ట్రగుల్స్ మొదలవుతాయి. అజ్ ఘోష్ తను కోరుకున్న లక్ష్యాన్ని సాధించగలడని నమ్మే వ్యక్తి చాందిని చౌదరి.