Vishal Dadlani : కంగనాని కొట్టిన కానిస్టేబుల్ కు ఉద్యోగం – మ్యూజిక్ కంపోజర్ విశాల్ దద్లానీ ఆఫర్

Vishal Dadlani
Vishal Dadlani : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ను చంఢీగఢ్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చేయిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి, అరెస్టు చేశారు. కంగనా రనౌత్ రైతుల నిరసనకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్ కారణంగానే కుల్విందర్ కౌర్ ఆమె చెంపపై కొట్టారని సింగర్ విశాల్ దద్లానీ ఆమెకు మద్ధతుగా నిలబడ్డారు.
ఫేమస్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ విశాల్ దద్లానీ కుల్విందర్ కౌర్ కు ఉద్యోగం ఆఫర్ చేశాడు. తాను హింసను ప్రోత్సహించను కానీ,
ఆ మహిళా కానిస్టేబుల్ కోపాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను అని సోషల్ మీడియాలో ఆయన పోస్టు చేశారు. సీఐఎస్ఎఫ్ ఆమెపై ఏదైనా చర్య తీసుకుంటే, ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని విశాల్ దద్లానీ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.
TAGS BJP MP KanganaChandigarh AirportCISFKangana RanautKulwinder KaurSinger Vishal DadlaniVishal Dadlani