JAISW News Telugu

Sajjala Bhargava Reddy : వైసీపీలో మొదలైన ముసలం.. సజ్జల వర్సెస్ రాజీవ్ కృష్ణ

Sajjala Bhargava Reddy

Sajjala Bhargava Reddy

Sajjala Bhargava Reddy : ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఓటమికి జగన్ అనుసరించిన నియంత పోకడలే కారణమని ప్రచారం జరుగుతోంది. ఆయనపై కొందరు సొంత పార్టీ నేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీలో ఉండాలా లేక తమ దారి తాము చూసుకోవాలా అన్న సందిగ్ధంలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అసలు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో కారణాలను విశ్లేషించుకోకుండా వైసీపీ నాయకులు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపణలు చేస్తూ టైం పాస్ చేసుకుంటున్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా సజ్జల వర్గం ఇదే ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తోంది. అయితే ఇతరులు మాత్రం. చేసింది మొత్తం చేసి ఇంకా జగన్ ను భ్రష్టుపట్టిస్తున్నారని సజ్జల వర్గం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటి వరకూ అంతర్గతంగా ఉన్న ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కింది.

ఎలాన్ మస్క్ ఈవీఎంలను నమ్మలేమని చేసిన ప్రకటనను పట్టుకుని ఆజ్ఞాతంలో ఉన్న సజ్జల భార్గవ ట్వీట్ చేశారు. ఆయన అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా అలాగే జరిగిందని వాదిస్తూ పోస్టు పెట్టారు. దీనిపై వెంటనే సలహాదారుగా ఉన్న రాజీవ్ కృష్ణ స్పందించారు. సజ్జల భార్గవకు కౌంటర్ గా ఆయన ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు. ఈవీఎంలపై ఆరోపణలు చేయడం ఆపాలని.. ఎన్నికలు సక్రమంగా జరిగాయని రాజీవ్ కృష్ణ తెలిపారు. తప్పుడు ప్రచారాల వల్ల ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగా భారత ఎన్నికల ప్రక్రియపై తప్పుడు సంకేతాలు వెళ్తాయని మండిపడ్డారు. ప్రజాతీర్పు ఏ నాయకుడైనా సరే గౌరవించాలన్నారు. దీనికి సజ్జల భార్గవ వివరణ ఇచ్చారు. ఈవీఎంలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందని.. తాను తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానంటూ వివరించారు.  వైసీపీలోనే తమ ఓటమికి కారణంగా ఈవీఎంలను నిందించడానికి సిద్ధం కావడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశంపై పార్టీలో చర్చ జరగకపోగా.. ఓటమికి బాధ్యత తీసుకునేందుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రెడీగా లేరు. తాము బలికావడానికి సజ్జల, ఆయన కుమారుడు కూడా సిద్ధంగా లేరు. అందుకే ఈవీఎంల అంశాన్ని తెరపైకి తెచ్చి ఇలా మరోసారి నవ్వుల పాలవుతున్నారు.

Exit mobile version