junior doctor : జూనియర్ డాక్టర్ పై హత్యాచారం.. 50 మంది డాక్టర్ల రాజీనామా

junior doctor
junior doctor murder Case : కోల్ కతాలోని ఆర్జీఆర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతుగా ఆర్జీకర్ ఆస్పత్రికి చెందిన 50 మంది సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు మంగళవారం మూకుమ్మడి రాజీనామా చేశారు.
ఆస్పత్రిలో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ కు న్యాయం చేయాలని, ఆస్పత్రిలో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు జూనియర్ డాక్టర్లు గత శనివారం సాయంత్రం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. రోజురోజుకీ వీరి నిరసనలకు వైద్యుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలోనే నిరసనలు చేస్తున్న డాక్టర్లకు మద్దతుగా 50 మంది సీనియర్ డాక్టర్లు రాజీనామా చేశారు. దీంతో అక్కడున్న విద్యార్థులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు.