JAISW News Telugu

Home Minister Anita : బాలికపై హత్యాచారం.. నిందితుడికి శిక్షపడేలా చేస్తాం : హోంమంత్రి అనిత

Home Minister Anita : తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మూడేళ్ల బాలికపై హత్యాచారం ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడటం హేయమన్నారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మృతి చెందిన బాలిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని హోంమంతి అనిత తెలిపారు.
Exit mobile version