Mumbai Indians : ముంబై ఇండియన్స్ వరుస ఓటములు..ఏం చేస్తే గెలుపు బాట పడనుంది?

Mumbai Indians

Mumbai Indians

Mumbai Indians : ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ పరిస్థితి అధ్వానంగా మారింది. వరుస ఓటములు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మొదటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై రెండో మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై మూడో మ్యాచ్ లో రాజస్థాన్ పై పరాజయం ఆ జట్టును కుంగదీస్తోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని అందరు తప్పుపడుతున్నారు. అతడి ఆట తీరు సరిగా లేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో అతడిపై నెగెటివ్ కామెంట్లు ట్రోల్ అవుతున్నాయి.

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మనే ఉండాలని కొందరంటే ఇంకా కొందరు హార్దిక్ పాండ్యానే కరెక్ట్ అనే వాదనకు దిగడంలో పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించారు. కానీ ఇప్పుడు వరుస ఓటములతో అతడికి ఎందుకు కెప్టెన్సీ ఇచ్చాంరా అనే ధోరణిలో యాజమాన్యం ఉందని అంటున్నారు. ఓటములతో చిర్రెత్తిపోతున్నాడు.. సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు.

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మలింగను నెట్టేయడం, కుర్చీ తీసుకోవడం వంటి చర్యలకు దిగడం వివాదాలకు తావిచ్చింది. పాండ్యా ఒత్తిడి వల్ల సరిగా ఆడలేకపోతున్నాడనే వాదనలు కూడా వస్తున్నాయి. తన భార్య వల్లే పాండ్యా సరిగా ఆడడం లేదనే కామెంట్లు అభిమానులు చేస్తున్నారు. నటాషాకు విడాకులు ఇస్తేనే పాండ్యా సరిగా ఆడతాడని అంటున్నారు. ఈనేపథ్యంలో పాండ్యా జట్టును ఎలా ముందుకు తీసుకెళ్తాడో తెలియడం లేదు.

అన్ని మ్యాచుల్లో స్వల్ప స్కోరుతోనే ఓడిపోవడం గమనార్హం. కొంచెం కష్టపడితే గెలిచే అవకాశం ఉండేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో పాండ్యా స్థిరమైన ఆట కొనసాగించలేకపోతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముంబయి ఇండియన్స్ ను గాడిలో పెట్టే సత్తా అతడికి లేదనే నెగెటివ్ కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాండ్యా భవితవ్యం ఏంటో అంతుచిక్కడం లేదనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే మూడు మ్యాచ్ లు ఓడిపోవడంతో ఆ జట్టు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. జట్టు ప్రదర్శన పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక నాలుగో మ్యాచ్ లో గెలవకుంటే మాత్రం ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా మారడం ఖాయం. ఇప్పటికైనా జట్టు యాజమాన్యం, ఆటగాళ్లు అంతా కలిసి ఓసారి సమీక్ష చేసుకుని ఏం చేస్తే గెలుస్తామో డిసైడ్ కావాలి. అలా అయితేనే ముంబై ఈ సీజన్ లో అలరించగలుగుతుంది.

TAGS