Hardik Pandya : ముంబయి ప్లేయర్లు హర్దిక్ కు సహకరించడం లేదా?
Hardik Pandya : ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 16 వ సీజన్ కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మను కాదని హర్ధిక్ పాండ్యాను ముంబయి టీంకు కెప్టెన్ ను చేసింది. రోహిత్ శర్మను సంప్రదించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినా కూడా హిట్ మ్యాన్ అభిమానులు ముంబయి ఓనర్స్ పై మండిపడుతున్నారు. ఇండియా టీం కెప్టెన్, ముంబయి ఇండియన్స్ కు అయిదు సార్లు కప్ అందించిన హిట్ మ్యాన్ ను కెప్టెన్ నుంచి తొలగించి హర్దిక్ ను కెప్టెన్ చేయడం ఏంటనీ గుర్రు మీద ఉన్నారు.
స్టేడియంలో హర్దిక్ కనిపించిన ప్రతిసారీ రోహిత్ అంటూ గట్టిగా అరుస్తూ టీజ్ చేస్తున్నారు. ఇవేవీ పట్టించుకోని హర్దిక్ తన పని తాను కానిచ్చేస్తున్నాడు. రోహిత్ ను పీల్డింగ్ లో థర్డ్ మ్యాన్ లో పెట్టడం చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. హర్దిక్ కావాలనే ఆటిట్యూడ్ చూపిస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు.
అయితే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి వాంఖేడే లో ఓడిపోయింది. హర్దిక్ పోస్టు మ్యాచ్ ప్రజేంటేషన్ లో మాట్లాడుతూ.. రుత్ రాజ్ కు ఎంస్ దోని చాలా సపోర్టు ఇస్తున్నాడని చెప్పాడు. కానీ రోహిత్ గురించి ప్రస్తావించలేదు. అంటే రోహిత్ శర్మ హర్దిక్ కు సహకరించడం లేదని పరోక్షంగా విమర్శలు చేశాడు. దీని గురించి క్రికెట్ ఎక్స్ పర్ట్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హర్దిక్ టీం లో ఓంటరివాడయ్యాడు. హర్దిక్ కు ముంబయి ఆటగాళ్లు ఎవరూ సహకరించడం లేదని పరిస్థితులు గమనిస్తే అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితులు టీం గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయి. ముంబయి ఇండియన్స్ టీం ఐపీఎల్ లో ఇప్పటివరకు అయిదు సార్లు కప్ గెలుచుకుని తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి టీంలో కెప్టెన్ విషయంలో పొరపొచ్చాలు రావడం చూస్తుంటే అది టీంకే మంచిది కాదని క్రికెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ వచ్చే సీజన్ లో ఈ టీంకు ఆడకపోవచ్చని అనుకుంటున్నారు.