JAISW News Telugu

Dhoni Magic : వాంఖడే లో ముంబయి ఢీలా.. దోని మ్యాజిక్‌ తో చెన్నైచమక్‌

MI VS CSK, Dhoni Magic

MI VS CSK, Dhoni Magic

Dhoni Magic : ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన హై హోల్టేజ్ మ్యాచ్ లో చెన్నై 20 పరుగుల తేడాతో ముంబయిని మట్టికరిపించింది. టాస్ గెలిచిన ముంబయి ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్ కు దిగిన చెన్నై రెండో ఓవర్ లోనే రహనే వికెట్ ను కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ అయిదు సిక్సులు, అయిదు ఫోర్లతో 40 బంతుల్లోనే 69 పరుగులు, శివమ్ దూబె 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 66 పరుగులు చేయడంతో పాటు చివర్లో దోని 4 బంతుల్లోనే మూడు సిక్సులతో 20 పరుగులతో చెలరేగాడు. దీంతో 20 ఓవర్లలో చెన్నై 206/4 స్కోరు చేయగలిగింది.

ముంబయి బౌలర్లలో హర్దిక్ రెండు వికెట్లు తీసుకోగా.. గత మ్యాచ్ హిరో బుమ్రా వికెట్లమీ పడగొట్టలేదు. చివరి ఓవర్ లో నాలుగు బంతులు ఉండగా బ్యాటింగ్ కు దిగిన దోని తనదైన మార్క్ షాట్లలో హ్యట్రిక్ సిక్సులు బాదాడు. మొత్తం 4 బంతులు ఎదుర్కొని 20 పరుగులు చేయగా.. అదే 20 పరుగుల తేడాతో ముంబయి ఓటమి పాలైంది.

ఛేజింగ్ లో ముంబయి ఇండియన్స్ మొదటి పది ఓవర్లలో 100 పరుగులు చేసినా మధ్య ఓవర్లలో తడబడి ఛేదనలో వెనకబడింది. రోహిత్ శర్మ 63 బంతుల్లోనే అయిదు సిక్సులు, 11 ఫోర్లతో పోరాడినా మిగతా బ్యాటర్లు చేతులెత్తేయడంతో చివరి వరకు క్రీజులో ఉన్నా.. ముంబయి ఇండియన్స్ ను గెలిపించలేకపోయాడు. తిలక్ వర్మ 21 బంతుల్లో 30 పరుగులు రెండో టాప్ స్కోరర్ కాగా.. గత మ్యాచ్ హిరో సూర్య కుమార్ యాదవ్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇషాన్ కిషన్, హర్దిక్, రోమారియో షెపర్డ్, సూర్య విఫలం కావడం దెబ్బతీసింది.

ఇది కచ్చితంగా చేజబుల్ టోటల్ అని ముంబయి కెప్టెన్ హర్దిక్ పాండ్యా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో అన్నాడు. రోహిత్ శర్మకు ముంబయి ఇండియన్స్ తరఫున ఇది రెండో సెంచరీ. గతంలో 2012 లో కోల్ కతా నైట్ రైడర్స్ పై సెంచరీ చేసిన రోహిత్ మళ్లీ ఇన్నాళ్లకు సెంచరీ చేసినా మ్యాచ్ మాత్రం గెలిపించలేకపోయాడు.  ఐపీఎల్ చరిత్రలో గతంలో యూసుప్ పఠాన్, సంజు శాంసన్ లు కూడా సెంచరీలు చేసినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు.

Exit mobile version