Mumbai actress : ముంబై నటి కేసు.. ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
Mumbai actress Case : ముంబై నటి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్ని, ఏసీపీ, సీఐ, హైకోర్టు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 15కు వాయిదాపడింది. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ఏజీ కోర్టును అభ్యర్థించారు. దీంతో విచారణ ఈనెల 15కు వాయిదాపడింది. అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ముంబై నటి కాదంబరీ జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు వీరిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.