Mukesh Ambani : ప్రముఖ టెలికాం దిగ్గజం ‘రిలయన్స్ జియో’ ఇటీవల రీచార్జ్ రేట్లను పెంచింది. ఈ పెంపు 10 నుంచి 20 శాతానికి పైగానే ఉన్నాయి. దీంతో జియో యూజర్స్ ఖంగు తిన్నారు. ఏంటి ముఖేష్ అంబానీ ఒక్క సారిగా యూజర్స్ పై విరుచుకుపడ్డాడని మండిపడుతున్నారు. ఈ టారీఫ్ రేట్లు వచ్చే నెల నుంచి అందుబాటులోకి వస్తాయని కూడా రిలయన్స్ జియో కంపెనీ తెలిపింది.
అయితే టెలికాం పరిశ్రమ గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తూ వచ్చింది. ఇటీవల పెంచుకుంటూ వెళ్లాయి. జియో తమ టారీఫ్ లను అనౌన్స్ చేసిన మరునాడే (జూన్ 28) భారతీ ఎయిర్ టెల్ కూడా రీచార్జి టారీఫ్ లను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో అంబాని ఫ్యామిలీ ట్రోల్స్ ను ఎదుర్కొంటోంది. ఎందుకంటే ముఖేష్ అంబాని కొడుకు అనంత్ అంబాని-రాధికా మర్చంట్ వివాహం ఖారారైంది. ఈ వివాహానికి సంబంధించి రెండు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు నిర్వహించారు. ఒక్కో ఈవెంట్ కు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఫస్ట్ ఈవెంట్ అంబాని కుటుంబం పుట్టిన ఊరు గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు వరల్డ్ ఫేమస్ పర్సన్స్ హాజరయ్యారు. ఇక సెకండ్ ఈవెంట్ ఇటలీలోని ఒక క్రూయిజ్ లో జరిగింది. ఇక్కడికి కూడా ప్రపంచంలోని పెద్ద పెద్ద పరిశ్రమలకు చెందిన వారు. బడా బడా నాయకులు, సినీ ఇండస్ట్రీ పెద్దలు వచ్చారు.
ఇక వివాహం వచ్చే నెల (జూలై) 12వ తేదీ ఉండడంతో ఒక్కవివాహానికే రూ. 1000 కోట్లు వరకు ఖర్చు చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొడుకు పెళ్లి కోసం టారీఫ్ లను పెంచావా ముఖేష్ మామా అంటూ నెటిజన్ల నుంచి అంబాని ఫ్యామిలీ ట్రోల్స్ ఎదుర్కొంటోంది.