JAISW News Telugu

Mudragada : జగన్ తేల్చట్లే.. తనదైన రాజకీయం మొదలుపెట్టిన ముద్రగడ!

Mudragada padmanabham started his own politics

Mudragada padmanabham started his own politics

Mudragada : కాపు నేత ముద్రగడ పద్మనాభానికి వైసీపీ అధినేత, సీఎం జగన్ హ్యాండ్ ఇవ్వడంతో ఇక ఆయన తన మార్క్ రాజకీయాలు షురూ చేశారు. ఆయనకు లేదా ఆయన కొడుక్కి పెద్దాపురం లేదా కాకినాడ టిక్కెట్ అని వైసీపీలో ప్రచారంలో జరిగింది. ఇది నిజమేననుకుని ముద్రగడ కూడా  వైసీపీలో చేరేందుకు పెట్టేబేడ సర్దుకున్నారు. తీరా జగన్ జాబితాల మీద జాబితాలు కసరత్తు చేస్తున్నారు. కానీ ముద్రగడకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు రావడం లేదు. అసలు తన పేరు పరిశీలనలో లేదని తేలడంతో ముద్రగడ వెంటనే తన మార్క్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెర తీశారు.

రీసెంట్ గా జనసేనాని పవన్ కల్యాణ్ తనను కాపు పెద్దలు ఎన్ని ఆరోపణలు చేసినా లైట్ తీసుకుంటానని, వైసీపీలో అవమానాలకు గురై తన దగ్గరకు వచ్చినా ఆదరిస్తానని ప్రెస్ నోట్ సైతం రిలీజ్ చేశారు. ఈ మాత్రం సందిస్తే చాలనుకున్నారో ఏమో గానీ ఇక ముద్రగడ జనసేనతో టచ్ లోకి వెళ్లిపోయారు. జనసేన నేతలు బొలిశెట్టి , తాతాజీ, కాపు జేఏసీ నేతలు బుధవారం ఆయన్ను కలిశారు. మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పుకొచ్చారు. గురువారం పొద్దున ముద్రగడ ఇంటికి టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కూడా వెళ్లారు. కాపులంతా ఐక్యంగా ఉండాలనే ప్రపోజల్ తో చర్చలు జరిపారు.

ముద్రగడ పద్మనాభం వచ్చే ఎన్నికల్లో తన కొడుకు లేదా కోడలికి టికెట్ ఆశిస్తున్నారు. వైసీపీలో మొదటి టికెట్ మాత్రమే కాదు ఖర్చులకు కూడా డబ్బులిస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ తర్వాత ఏమైందో ఏమో గాని మాట్లాడడం కూడా మానేశారు. వైసీపీతో ఆశతో ముద్రగడ తన అనుచరులకు ఇంట్లో పార్టీ కూడా ఇచ్చారు. కానీ వైసీపీ నుంచి ఏ క్లారిటీ రాకపోవడంతో ఏమీ చెప్పలేకపోయారు. ఇక జగన్ పట్టించుకోరు అని ఆయనకు అర్థం కావడంతో ఈ విషయాన్ని త్వరగా తేల్చేయాలని జనసేన, టీడీపీ నేతలను తన ఇంటికి పిలిపించుకుంటున్నారు.

Exit mobile version