JAISW News Telugu

Mudragada : జగన్ పార్టీకి ముద్రగడ ఎఫెక్ట్? ఆ జిల్లాల్లో..

Mudragada

Mudragada Padmanabham

Mudragada Padmanabham : ‘‘జగన్ తాను అనుకున్నదే చేస్తాడు.. చేసే దాక వదలడు’’ అని ఆయన అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. ఇక రాబోయే ఎన్నికల్లో జగన్ మార్పులు, చేర్పులతో పార్టీ సిట్టింగుల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఇప్పటికే పలువురు ఇతర పార్టీల్లో చేరిపోగా.. ఎన్నికల నాటికి మరికొందరు జంప్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అయినా కూడా తన అభ్యర్థుల మార్పు తనకే కలిసివస్తుందని జగన్ భావిస్తున్నారు. ఈమేరకు ఆయన ఇతర నేతల చేరికలను కూడా లైట్ తీసుకుంటున్నారు.

కాపు నేత ముద్రగడ పద్మనాభంతో  ఆ మధ్య టచ్ లోకి వైసీపీ నేతలు వెళ్లారు. ముద్రగడకు లేదా ఆయన కుటుంబానికి సీటు ఖరారైందని, ఆయన వైసీపీలో చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో మళ్లీ వైసీపీ నేతలు సైలంట్ కావడం.. ఇక ముద్రగడ జనసేన, టీడీపీల వైపు మొగ్గు చూపడం అందరికీ తెలిసిందే. ఇరు పార్టీల నేతలు ఆయనతో చర్చించారు.

కాగా, ముద్రగడ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కాకుండా రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ముద్రగడ వైసీపీలో చేరినా, చేరకున్నా పెద్దగా ప్రయోజనం లేదని జగన్ భావించారని, అందుకే ముద్రగడ డిమాండ్లను జగన్ పట్టించుకోలేదని అంటున్నారు. గతంలో కూడా ముద్రగడ తమ పార్టీకి మద్దతు ఇవ్వకున్నా సదరు జిల్లాల్లో అత్యధిక సీట్లే గెలుచుకున్నామని, ఇప్పుడు కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయని జగన్ అంచనా వేస్తున్నారు. అందుకే ముద్రగడ చేరికను లైట్ తీసుకున్నట్టు సమాచారం.

అయితే.. గతంలో జరిగినా ఎన్నికలకు ఈ ఎన్నికలకు తేడా ఉంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కు ఒక్కసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఆలోచించారు. ఆయన పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సానుభూతి కూడా కలిసివచ్చింది. కానీ ఈ ఎన్నికల్లో అధికార పార్టీగా ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు..ఇలా చాలా వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. దీన్ని తట్టుకోవాలంటే ప్రతీ వ్యక్తి కీలకమే అవుతారు. కానీ జగన్ దాన్ని విస్మరించి..తాను ఒంటరిగానే అధికారంలోకి వస్తానని భావిస్తున్నారు.

ఇక ముద్రగడ జనసేనలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కాపు, కమ్మ సామాజిక వర్గం కాంబినేషన్ లో టీడీపీ-జనసేన కూటమికి కోస్తాంధ్రలో భారీగా లాభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో కూడా అదే తేలింది.

Exit mobile version