JAISW News Telugu

Mrunal thakur:మ్యాగజైన్ క‌వ‌ర్‌పై మెంట‌లెక్కించిన మృణాల్

Mrunal thakur:మృణాల్ ఠాకూర్ అలియాస్ సీత‌మ్మ ఫ్యాష‌న్ ఎంపిక‌లు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స్టైలిష్ డిజైన‌ర్ లుక్స్ తో కిల్ చేయ‌డంలో మృణాల్ త‌ర్వాతే. దుస్తుల ఎంపిక‌లో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ని తాను స‌రికొత్త‌గా ఆవిష్క‌రిస్తుంటుంది. గ్లామ‌ర్ యాంగిల్ కి కాస్త దూరంగా ఉంటూ క్రియేటివ్ లుక్స్ తోనే యువ‌త‌ని ఆక‌ర్షించ‌డం ఈ భామ‌ ప్ర‌త్యేక‌త‌. సీతారామంలో నూర్ జ‌హాన్ గా త‌న‌లో బ్యూటీని ఆవిష్క‌రించి ఓ కొత్త ఇమేజ్ ని సొంతం చేసుకుంది. అప్ప‌టి నుంచి సీత‌మ్మ పాత్ర‌ధారి మృణాల్‌ని టాలీవుడ్ ఆడియ‌న్స్ చూసే విధానంలోనూ మార్పు వ‌చ్చింది.

ఇక లెహంగాలాంటి దుస్తుల్లో మృణాల్ బ్యూటీని వ‌ర్ణించ‌డం మాట‌ల‌కి సాధ్యంకానిది. మ‌ల్టీ డిజైనర్ లెహంగాల్లో త‌న‌ ఎత్తును మ్యాచ్ చేస్తూ డిజైన్ చేసిన దుస్తులు మ‌రింత బ్యూటీని ఎలివేట్ చేస్తాయి. తాజాగా మృణాల్ ప్ర‌ఖ్యాత ట్రావెల్ లెయిజ‌ర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం ఫోటోషూట్ లో పాల్గొంది. ఇందులో ర‌క‌ర‌కాల డిజైన‌ర్ డ్రెస్ ల‌తో క‌నిపించింది. ఇక‌ వైట్ క‌ల‌ర్ లెహంగాలో ఒదిగిపోయిన మృణాల్ టీనేజీ మెరుపుల‌తో మురిపించింది. చెక్కు చెద‌ర‌ని రూప లావ‌ణ్యం… స్లిమ్ లుక్..వైట్ లెహంగాలో ఎంతో అందంగా క‌నిపించింది. టాప్ టూ బాట‌మ్ ఒకే డిజైన్ మృణాల్ ని ఎంతో అందంగా ఎలివేట్ చేసింది.

లెహంగా పై నెమ‌లి పించం డిజైన్ దుస్తుల్ని మ‌రింత ఆక‌ర్ణ‌ణీయ రూపాన్ని తీసుకొచ్చాయి. లాంగ్ షార్ట్ లో మృణాల్ మ‌రింత తీగ‌గా క‌నిపించింది. ఇప్ప‌టి మృణాల్ నా? ఇండ‌స్ట్రీకొచ్చిన కొత్త‌లో ఉన్న మృణాల్ రూప‌మా? అన్న సందేహం క‌లుగుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. మృణాల్ ని అలా చూసి అంతా షాక్ అవుతున్నారు. అభిమానులు ఈ ఫోటోల‌పై కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

కెరీర్ సంగ‌తుల‌కు వ‌స్తే… సీతారామం త‌ర్వాత నానితో హాయ్ నాన్న‌లో న‌టించిన మృణాల్ త‌దుప‌రి క్రేజీ ప్రాజెక్ట్ ల్లోనే న‌టిస్తోంది. హాయ్ నాన్న సినిమాతో మంచి విజ‌యం ఖాతాలో వేసుకుంది. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఫ్యామిలీ స్టార్ లోనూ న‌టిస్తోంది. ఈ సినిమాపైనా అంచ‌నాలున్నాయి. ఇంకా కొత్త ప్రాజెక్ట్ లు కొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి.

 

Exit mobile version