Mrunal Thakur : పిల్లలను కనడంపై మృణాల్ షాకింగ్ కామెంట్స్

Mrunal Thakur
Mrunal Thakur : పెళ్లి, పిల్లలను కనడంపై హీరోయిన్ మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని.. కానీ పిల్లలను కనే ఆలోచన లేదని తెలిపారు. కెరీర్, లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ముఖ్యమని, మనల్ని అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్ రావడం అవసరమని అన్నారు. ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపింది.
సీతారామం సినిమాతో టాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది. సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ కావడంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తాజాగా పిల్లల్ని కనడంపై ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.