Mrunal Thakur : రాజమౌళి సినిమా సీక్వెల్ పై మృణాల్ ఆశలు.. ఇది డిజాస్టర్ అయితే..

Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో సీతా రామంతో భారీ హిట్ కొట్టింది. తర్వాతి సినిమా హాయ్ నాన్న కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. కానీ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. దీంతో హ్యాట్రిక్ కు దూరమైంది.

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. సూపర్ 30 వంటి పాపులర్ మూవీలో నటించినా మొదట్లో ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ‘సీతా రామం’ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ఆమెను తెలుగు పరిశ్రమలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించింది.

ఆ తర్వాత ఆమె నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆమె విజయ్ దేవరకొండతో కలిసి నటించిన మూడో సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ ఫ్లాప్ గా నిలవడంతో హ్యట్రిక్ చేజారిపోయి, ఆమె కెరీర్ కు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.

ఇందులో అజయ్ దేవగన్ నటిస్తున్న సన్ ఆఫ్ సర్దార్ 2. 2012లో విడుదలైన ‘సన్ ఆఫ్ సర్దార్’ ఓ మోస్తరు విజయాన్ని సాధించి రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న ఆధారంగా తెరకెక్కింది. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత సీక్వెల్ నిర్మాణంలో ఉంది. సన్ ఆఫ్ సర్దార్ 2 షూటింగ్ యూకేలో ప్రారంభమైందని అజయ్ దేవగన్ ఇటీవల ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో ఒక వీడియోను పంచుకున్నారు.

ఈ వీడియోలో దేవగన్ గురుద్వారాలో ప్రార్థనలు చేస్తుండగా, మృణాల్ ఠాకూర్ పంజాబీ సూట్ ధరించి ఉత్సాహంగా ధోల్ వాయించారు. ఈ చిత్రం తన బాలీవుడ్ కెరీర్ కు ఊతమిస్తుందని, తాను అనుకున్న విజయాన్ని అందిస్తుందని మృణాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా విజయంతో బాలీవుడ్ లో తన కెరీర్ సాలిడ్ రీస్టార్ట్ అవుతుందని మృణాల్ భావిస్తోంది.

TAGS