Mrunal Thakur Glamour : మృణాల్ ఠాకూర్.. ఈ భామ గురించి తెలియని వారు లేరు.. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.. ఒకప్పుడు కేవలం సీరియల్ హీరోయిన్ గా ఉన్న ఈ భామ ఇప్పుడు వెండితెరపై గ్లామరస్ హీరోయిన్ గా వెలుగొందుతుంది.. భాగ్య సీరియల్ తో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ ఆ తర్వాత లక్కీ ఛాన్స్ అందుకుంది.
డైరెక్ట్ గా హిందీ వెండితెర మీద అవకాశం అందుకుని మంచి పాపులారిటీ దక్కించుకుంది.. ఇక ఆ తర్వాత ఈమెకు సౌత్ లో అవకాశం రావడంతో ఇక్కడ కూడా అడుగు పెట్టి అదృష్టం పరీక్షించు కుంది.. సీతారామం అమ్మడి సౌత్ తొలి మూవీ.. ఇదే సినిమాతో ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది.
సీతారామం మూవీ సౌత్ లో సూపర్ హిట్ అవ్వడంతో ఈమె నటనకు, అందానికి అంత ఫిదా అయ్యారు.. ఫలితంగా మృణాల్ కు సౌత్ లో భారీ ఫాలోయింగ్ పెరిగింది. అలాగే వరుస అవకాశాలు కూడా వరించాయి.. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూనే సౌత్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం ఈమె ఫాలోవర్స్ కు బాగా తెలుసు. సినిమాలు చేస్తూనే ఎప్పటికప్పుడు తన సినిమాల గురించి లేటెస్ట్ ఫోటో షూట్స్ వంటివి షేర్ చేస్తూ క్రేజ్ పెంచేసుకుంటుంది.. తాజాగా డిజైనర్ డ్రెస్ లో అమ్మడి గ్లామరస్ పిక్స్ షేర్ చేయగా అంతా ఫిదా అవుతున్నారు. క్యూట్ లుక్స్ తో పాటు ఎద అందాలు మొత్తం కనబడేలా ఫోటో షూట్ షేర్ చేసింది.. ఈ పిక్స్ క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.