Mr. and Mrs. Mahi Review : రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి..

Mr. and Mrs. Mahi Review :

సినిమా పేరు: Mr & Mrs మహి
విడుదల తేదీ : మే 31, 2024
నటీనటులు: రాజ్‌కుమార్ రావు, జాన్వీ కపూర్, రాజేష్ శర్మ, కుముద్ మిశ్రా, జరీనా వహాబ్ ఇతరులు
దర్శకుడు: శరణ్ శర్మ
నిర్మాతలు: కరణ్ జోహార్, జీ స్టూడియోస్, హీరో యష్ జోహార్, మరియు అపూర్వ మెహతా
సంగీత దర్శకులు : ఆదేశ్ శ్రీవాస్తవ, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి, జానీ, అచింత్-యువ, హన్నీ-బన్నీ, ధృవ్ ధల్లా మరియు జాన్ స్టీవర్ట్ ఎదురురి
సినిమాటోగ్రాఫర్: అనయ్ గోస్వామి
ఎడిటర్: నితిన్ బైద్

రాజ్‌కుమార్ రావు – జాన్వీ కపూర్ నటించిన మిస్టర్ & మిసెస్ మహి భారీ విజయాన్ని సాధించింది. విడుదలైన ఒక్కరోజే రూ. 7 కోట్లకు పైగా వసూలు చేసింది.

కథ..
మహేంద్ర అగర్వాల్ (రాజ్‌కుమార్ రావు) భారత క్రికెట్ జట్టులో చేరాలని కలలు కంటూ విఫలమవుతాడు. దీంతో అతని తండ్రి అతన్ని కుటుంబ వ్యాపారం చూసుకోవాలని సూచిస్తారు. ఇక పెళ్లి ఈడు కూడా వచ్చిందని తల్లిదండ్రులు డాక్టర్ మహిమ (జాన్వీ కపూర్)తో వివాహం చేస్తారు. మహిమకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆమె సపోర్ట్ తో తన కలను సాకారం చేసుకోవాలని అనుకుంటాడు. మహిమ అతని కోరికకు మద్దతిస్తుందా? భర్త కోసం ఉద్యోగం వదిలేస్తుందా? వారి తల్లిదండ్రులు ఎలా సమర్థిస్తుంది? చివరికి ఏం జరుగుతుంది? అది సినిమాలో తెలుసుకోండి.

ప్లస్ పాయింట్లు..
సినిమాలో రాజ్ కుమార్ నటన అత్యంత పీక్స్ అని చెప్పవచ్చు. ఆశ, బాధ, వైఫల్యం, ఆశయాన్ని అనుభవించే పాత్రను అతని చిత్రణ నిజంగా విశేషమైంది. జాన్వీ కపూర్ స్క్రీన్‌పై డీసెంట్‌ లుక్ గా కనిపిస్తుంది. క్రికెట్ నేర్చుకోవడంలో ఆమెకు ఉన్న అంకితభావం నటనలో స్పష్టంగా కనిపిస్తుంది. మహేంద్ర తండ్రిగా నటించిన కుముద్ మిశ్రా, కోచ్‌గా రాజేష్ శర్మ వంటి ఇతర నటీనటులు తమ పాత్రల్లో మెచ్చుకోదగిన నటనను ప్రదర్శించారు.

మైనస్ పాయింట్లు..
ఇలాంటి చిత్రాలకు ఎఫెక్టివ్ ప్రమోషన్ కీలకం అయితే, ట్రైలర్ అనుకోకుండా చాలా ఎక్కువ రివీల్ చేయడం వల్ల పెద్ద స్క్రీన్ పై పెద్దగా అనుభూతి పొందినట్లు అనిపించలేదు. కథాంశం ఊహకు దగ్గరగా ఉంటుంది. ఇది క్రికెట్ అభిమానుల సహనాన్ని పరీక్షిస్తుంది. T20 మ్యాచ్‌లోని హడావిడిని అందించడానికి బదులు, సినిమా టెస్ట్ మ్యాచ్‌ చూస్తున్నామా అన్నంత స్లోగా కదులుతుంది.

ప్రాక్టీస్ సన్నివేశాలు, మ్యాచ్‌లు నిజమైన ఉత్సాహాన్ని రేకెత్తించడంలో విఫలమయ్యాయి. క్రికెట్ మ్యాచ్, కుటుంబ నాటకం మధ్య లైన్లను అస్పష్టం చేస్తాయి. ఈ గందరగోళం సుదీర్ఘమైన రన్‌టైమ్ అంతటా కొనసాగుతుంది.

పాటలు కొంత వరకు బెటరే అని చెప్పవచ్చు. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్దగా అనిపించలేదు. చిత్రంలోని సన్నివేశాలకు తగ్గట్లుగా మరింత హైలెట్ గా తీసి ఉంటే బాగుండేది.

చివరగా..
మొత్తం మీద, మిస్టర్ & మిసెస్ మహి స్పోర్ట్స్ డ్రామా అనుకున్నంత ఎగ్జయిట్ మెంట్ గా లేదు. ఇది ఓవర్ లాంగ్ షార్ట్ ఫిల్మ్ లాగా సాగుతుంది. వీక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. రాజ్‌కుమార్ రావు పాత్రలో కొంత ఎగ్జయిట్ మెంట్ కనిపించినా సినిమా బాగా బోర్ కొడుతుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చిన సినిమా, కొన్ని సన్నివేశాలు బాగున్నాయి కాబట్టి ఒకసారి చూడవచ్చు.