TDP : గురువారం అమరావతి మండలం మండేపూడి గ్రామ వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులతో పాటు పలువురు టీడీపీలో చేరారు. ఎంపీటీసీ సభ్యులు కోట వెంకటేశ్వర్లు, కోలగంటి శ్రీనివాసరావు, కోట శ్రీనివాసరావు, మేకల మీరయ్య, మేకల గోవిందు, మేకల రవితేజ, ఎడ్లూరి అనిల్, సోమేపల్లి శ్రీనివాసరావు తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించి, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతానని అన్నారు. ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ (ఈవీఎం) సంఖ్య 3 సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.