India TV-CNX Survey : టీడీపీ కూటమికి అన్ని ఎంపీ సీట్లు..  ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ సర్వేలో సంచలన విషయాలు..

India TV-CNX Survey

India TV-CNX Survey

India TV-CNX Survey : భారతదేశంలో ఎన్నికల జాతర మొదలైంది. దేశంలో ఏడు విడుతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ (ఎలక్షన్ కమిషన్) శనివారం (మార్చి 16) షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా మే 13న ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పింది. దీంతో సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. ఒక్కో సర్వే ఒక్కో పార్టీకి అనుకూలంగా ఫలితాలను ఇస్తుంది.

తాజాగా ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని కూటమి గణనీయమైన సీట్లను సాధించవచ్చని అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు పార్లమెంట్ కు పోలింగ్ జరిగితే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 17 సీట్లు గెలుచుకోవడం ఖాయమని అంచనా వేసింది. 25 లోక్‌సభ స్థానాలకు గానూ వైఎస్సార్‌సీపీ 8 స్థానాలు గెలుచుకుంటుందని, మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ 14, జనసేన ఒకటి, బీజేపీ 6 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వేలో తేలింది.

బీజేపీ ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుండగా, టీడీపీ 17, జేఎస్పీ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 10 స్థానాల్లో, టీడీపీ 144 స్థానాల్లో, జేఎస్పీ 21 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. రాబోయే ఎన్నికలు ప్రధానంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఎన్‌ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ-బీజేపీ-జేఎస్‌పీ కూటమి మధ్యే జరగనున్నాయి.

రాష్ట్ర విభజన తర్వాత బలహీనపడిన కాంగ్రెస్ మళ్లీ బలం పుంజుకోవాలని భావిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల పీసీసీ చీఫ్‌ కావడం పార్టీ నైతిక స్థైర్యాన్ని పెంచింది. వైసీపీ ప్రభుత్వ లోపాలను, విధానాలను విమర్శిస్తూ పార్టీ ప్రతిష్టను పెంచేందుకు షర్మిల తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ కూడా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ 9 కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని అంచనా వేయగా, బీజేపీ 5, బీఆర్‌ఎస్ 2 మరియు ఎంఐఎం 1 గెలుచుకుంటాయని అంచనా వేస్తుంది.

TAGS