Tollywood Movies : ఏపీలో ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. నాలుగో విడతలో మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. ఇక రాజకీయ పార్టీలతో పాటు సాధారణ జనం కూడా ఎన్నికలపైనే ఆసక్తి కనబరుస్తారు. సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు అంటే ఊరూరా సంబరమే కాబట్టి జనాలు పార్టీల వారీగా డివైడ్ అయిపోయి ప్రచారాలు, సభలు, రోడ్ షోలో పాల్గొంటుంటారు. ఇప్పుడందరూ బిజీనే. ఇప్పుడిదే టాలీవుడ్ కు పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టింది. జనాలంతా రాజకీయాల్లో ఆసక్తిగా ఉంటూ సినిమాలను పట్టించుకోరని మేకర్స్ భయపడిపోతున్నారు. కోట్ల బడ్జెట్ పెట్టి తీసినా సినిమాలను రిలీజ్ చేసి అనవసరంగా లాస్ తెచ్చుకోవడం ఎందుకని ఆలోచనలో పడ్డారు.
సమ్మర్ సీజన్ లో రావాల్సిన సినిమాలు వాయిదా బాటపడుతున్నాయి. ఇందులో ముందుగా ‘‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’’ వంతు వచ్చింది. ఈ సినిమా ఎప్పుడో రెడీ అయినా.. ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉంది. అయితే మే 13 ఎన్నికలు అయిపోగానే 19వ తేదీన రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది.
ఇక మేలోనే ‘కల్కి’ విడుదల చేస్తామని చిత్రబృందం చెప్పింది. ఇప్పుడు ఆ డేట్ కూడా మార్చక తప్పని పరిస్థితి కనపడుతోంది. ఎలక్షన్ కు సరిగ్గా 4 రోజుల ముందు అంటే మే 9న కల్కి రావాల్సి ఉంది. ఇంత పెద్ద సినిమాను ఇంత రిస్కీ టైమ్ లో విడుదల చేసే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి కల్కి రిలీజ్ విషయంలోనూ ఒకట్రెండు రోజుల్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యలో విడుదలయ్యే క్రేజీ సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ ఒక్కటే. ఏప్రిల్ లోనే ఈ సినిమా వచ్చేస్తుంది. అప్పటికీ ఎన్నికలకు ఇంకా ఓ నెల సమయం ఉంటుంది కాబట్టి విజయ్ సినిమాకు ఎలాంటి అడ్డుఉండకపోవచ్చు. ఆ తర్వాత వచ్చే సినిమాలే రిలీజ్ డేట్లు మార్చుకోవాల్సి రావొచ్చు.