JAISW News Telugu

Movies on Sea : పూర్తిగా సముద్రంపై ఆధాపడి చేసిన సినిమాలు ఏంటో తెలుసా? ఇప్పటికీ ఇదే ట్రెండ్ నడుస్తుందా?

movies entirely based on sea

movies entirely based on sea

Movies on Sea : సముద్రం బ్యాక్ డ్రాప్ లో చాలా వరకు సినిమాలు వచ్చాయి. గతం నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. కానీ అప్పట్లో అడపా దడపా మాత్రమే వచ్చేవి. ఆ సమయంలో వీఎఫ్ఎక్స్ అంతగా లేదు.. దీనికి తోడు ఉన్న గ్రాఫిక్స్ తోనే నెట్టుకువచ్చేవారు. కానీ ఇప్పుడు అలాకాదు. మంచి వీఎఫ్ఎక్స్ ఉపయోగిస్తూ సినిమాలు చేస్తున్నారు. దీంతో సముద్రం బ్యాక్ డ్రాప్ లో సినిమా కావాలంటే సముద్రం వరకే వెళ్లాల్సిన అవసరం లేదు.. సెట్ లో కూడా సముద్రంను క్రియేట్ చేయవచ్చు.

ఉప్పెన సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. ‘జల జల జల జల పాతం నువ్వు’ ఈ పాటను స్టూడియోలో సెట్టింగ్ వేసి చేశారు. అద్భుతంగా వచ్చింది. దీన్ని నిజమైన సముద్రంలో తీసినట్లుగానే అనుభూతి కలిగించింది. ఇదంతా వేరు విషయం. కాస్త పక్కన పెడితే.. సముద్రం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న రీసెంట్ మూవీస్ పై లుక్కేద్దాం.

టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు సముద్రం బ్యాక్ డ్రాప్ తోనే వస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన దేవర సినిమాకు సంబంధించి పోస్టర్స్, గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.
సముద్రం ఇండస్ట్రీకి సెంటిమెంట్‌గా మారిందని అంటున్నారు. మరి సముద్ర నేపథ్యంలో వచ్చిన, రాబోతున్న సినిమాల గురించి తెలుసుకుందాం..

1. ఉప్పెన..
2021లో రిలీజైన ఉప్పెన సముద్రం నేపథ్యంలో వచ్చింది. ఇందులో హీరో జాలరిగా కనిపించాడు. ఈ సినిమాతో పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి వెండితెరపై అరెంగేట్రం చేశారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

2. వాల్తేరు వీరయ్య..
మెగా బాస్ చిరంజీవి గతేడాది చేసిన సినిమా వాల్తేరు వీరయ్య. ఇందులో మెగాస్టార్ జాలరిగా కనిపించాడు. డైరెక్టర్ బాబీ ఇందులో రవితేజను కూడా మరో కీలక పాత్ర గురించి తీసుకున్నాడు. ఈ మూవీ మంచి వసూళ్లను రాబట్టింది.

3. దేవర..
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం గ్రాఫిక్స్‌లో సముద్రం క్రియేట్ చేశారు. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్‌లో సముద్రం, సముద్ర తీరాన జరిగిన ఫైట్ హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే..

4. తండేల్..
అక్కినేని నాగ చైతన్య-చందూ మొండేటి కాంబోలో వస్తున్న ‘తండేల్’ మంచి సక్సెస్ సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. శ్రీకాకులం జాలరిగా నాగ చైతన్య కనిపించబోతున్నారు. దీని కోసం ఆయన బాగానే కష్టపడ్డాడు. గుజరాత్ లో జరిగిన యధార్థ కథతో తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు చెప్పాడు. నాగ చైతన్య బోట్ డ్రైవర్‌గా కనిపించబోతున్నారు. హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తోంది.

5. ఓజీ..
పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌-దర్శకుడు సుజిత్‌ కాంబోలో తెరకెక్కుతున్న ‘#OG’ ముంబై పోర్టు, సముద్రం నేపథ్యంలోనే కథ సాగుతుందట. సముద్రానికి సంబంధించిన కొన్ని సీన్స్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version