Aadu Jeevitham Review : సినిమా రివ్యూ: ఆడు జీవితం ఎలా ఉందంటే?
సినిమా: ది గోట్ లైఫ్ – ఆడు జీవితం
బ్యానర్: విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్
తారాగణం: పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్, జిమ్మీ జీన్ లూయిస్, శోభా మోహన్, కేఆర్ గోకుల్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
డీఓపీ: సునీల్ కేఎస్
ఎడిటర్: ఏ శ్రీకర్ ప్రసాద్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బ్లెస్సీ
రిలీజ్ డేట్: మార్చి 28, 2024
ఇటీవల ‘సలార్’లో ప్రభాస్ స్నేహితుడు దేవాగా నటించిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తన పాన్ ఇండియా చిత్రం ‘ది గోట్ లైఫ్-ఆడు జీవితం’ను హైదరాబాద్ లో కూడా ప్రమోట్ చేశారు. ఈ సినిమా ప్రీమియర్ షోలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మరి ఈ సినిమా ఎలా ఉందన్న దాని గురించి తెలుసుకుందాం.
కథ..
నజీర్ (పృథ్వీరాజ్ సుకుమారన్) గర్భవతి అయిన తన భార్య (అమలాపాల్)ను ఇంట్లో వదిలేసి మంచి అవకాశాల కోసం సౌదీ అరేబియా వెళ్తాడు. తన స్నేహితుడు హకీంతో కలిసి విమానాశ్రయానికి చేరుకోగానే తమను రిసీవ్ చేసుకోవడానికి కంపెనీ అధికారులు రాలేదని తెలుసుకుంటారు. హిందీ, ఇంగ్లిష్ లో మాట్లాడే ప్రావీణ్యం లేకపోవడం వల్ల ఇతరులతో కమ్యూనికేట్ చేయలేక అయోమయానికి గురవుతాడు. కొన్ని గంటల తరువాత, ఒక అరబ్ వ్యక్తి వారి వద్దకు వచ్చి తన జీపులో వారికి రైడ్ ఇస్తాడు.
అతను కంపెనీకి చెందినవాడని భావించి, తాము మోసపోయామని తర్వాత గ్రహిస్తారు. నజీబ్ ను ఎడారిలోని ఒక ప్రదేశానికి, హకీమ్ ను మరో ప్రాంతానికి తీసుకెళ్తారు. వారిని బలవంతంగా బానిసలుగా మార్చి మేకల పెంపకానికి అప్పగిస్తారు. చాలా సంవత్సరాలు బానిసత్వంలో గడిపిన తరువాత, వారు ఒక ఆఫ్రికన్ కార్మికుడి (జిమ్మీ జీన్-లూయిస్) సాయంతో తప్పించుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తారు. వారి ప్లాన్ ఎలా ఉంది.. అందులో వారు సక్సెస్ అవుతారా అన్నది కథ?
పెర్ఫార్మెన్స్..
పృథ్వీరాజ్ అద్భుతమైన నటన హైలైట్ గా నిలుస్తుంది. ప్రతి సన్నివేశంలోనూ ఆయన డెడికేషన్ కనిపిస్తుంది. కథ చివరి భాగంలో అతడు తన శరీరాకృతిని చూపించాడు. కేవలం ఈ సినిమా కోసమే ఆయన గణనీయంగా బరువు తగ్గి సన్నగా మారాడు. అతని చిత్తశుద్ధితో కూడిన నటన నజీబ్ (పాత్ర) బాధను సమర్థవంతంగా వివరిస్తుంది. పృథ్వీరాజ్ నటన అవార్డుకు అర్హమైనదిగా అనిపిస్తుంది. పృథ్వీరాజ్ స్నేహితుడి పాత్రలో కేఆర్ గోకుల్ కూడా అద్భుతంగా నటించాడు. జిమ్మీ జీన్ లూయిస్ తన కీలక పాత్రలో ఒదిగిపోయాడు. మినిమమ్ డైలాగ్ ఉన్నప్పటికీ కన్విన్సింగ్ గా చూపించాడు.
టెక్నికల్ ఎక్సలెన్స్..
సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడారి సన్నివేశాలు ఉత్కంఠ భరితంగా ఉంటాయి. అద్భుతమైన సినిమాటో గ్రఫీ వల్ల మమ్మల్ని అరేబియా ఎడారికి తరలించినట్లు అనిపిస్తుంది. ఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథానాయకుడు ఎదుర్కొనే చేదు అనుభవాన్ని పెంచుతుంది. ఎడిటింగ్ లో కచ్చితత్వం లోపించింది. ఇది నెమ్మదిగా సాగడమే కాకుండా, ఎక్కవ టైంను తీసుకుంటుంది.
హైలైట్స్.. *బేసిక్ స్టోరీ *పృథ్వీరాజ్ అదిరిపోయే పెర్ఫామెన్స్ *అదిరిపోయే ఎడారి విజువల్స్
లోపం: *స్లోగా సాగే కథనం* ఎక్కువ రన్ టైమ్
విశ్లేషణ..
‘ది గోట్ లైఫ్-అకా ఆడు జీవితం’ ఒక యదార్థ ఘటన ఆధారంగా రచయిత బెన్యామిన్ రాసిన మలయాళ నవల ఆధారంగా రూపొందించబడింది. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారికి కేరళ పెట్టింది పేరు. చాలా మంది కేరళకు చెందిన వారు సౌదీలో పెద్ద మాల్స్, వ్యాపారాల్లో సెటిల్ అయ్యారు. కాగా వీరికంటే ఎక్కువ మంది మోసపోయారు కూడా.
సౌదీ అరేబియాలో బానిసత్వంలోకి నెట్టివేయబడిన తరువాత మెరుగైన జీవితం కోసం ఆశలు అడియాసలైన ఒక వ్యక్తి యొక్క కథను ఈ చిత్రం చెబుతుంది.
కథలో ఒకే ఒక్క లైన్..
సౌదీ అరేబియాలో మోసపోయి బానిసత్వంలోకి వెళ్లిన భారతదేశానికి తిరిగి రావడానికి ఒక వ్యక్తి చేసే పోరాటం. మొదటి భాగం నజీబ్ సౌదీ అరేబియాకు వెళ్లడం, స్వదేశానికి తిరిగి వచ్చిన అతని జీవితం, అరబ్బులతో సంభాషించడానికి అతని సవాళ్లను సమర్థవంతంగా చిత్రించింది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రామా సెట్ చేయడానికే అంకితం చేశారు. ఈ ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి కథానాయకుడు పడే పోరాటాలపై సెకండాఫ్ ఫోకస్ చేస్తుంది.
సువిశాలమైన ఎడారి నుంచి కాలినడకన తప్పించుకోవడం ఎవరికైనా కష్టమే. ఎడారి విసిరిన అనేక సవాళ్లను కథానాయకుడు, అతని స్నేహితుడు ఎలా అధిగమిస్తారు? అన్నది బాగా చిత్రీకరించారు. ఇక, సెకండాఫ్ లో ఎడారిలోని అందమైన దృశ్యాలు ఉండటమే కాకుండా, ఇద్దరు సహచరులు ఎడారిలో ఎంత కష్టపడ్డారో, వారి మనుగడ పోరాటాలు వారి బాధను మనకు అనుభూతి కలిగిస్తాయి.
వారు తప్పించుకోవడానికి ఆడిన నాటకం ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. చిత్రాలు, నాటకీయ ప్రదర్శనలు బాగున్నాయి. అయితే స్లోగా సాగే డ్రామా కొంత నిరాశ పరుస్తుంది. ఇదొక మానవీయ కథనం. కానీ ఒక ముస్లిం వ్యక్తికి బేసిక్ హిందీ కూడా రాదనే విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టం.
ఓవరాల్ గా ‘ది గోట్ లైఫ్-ఆడు జీవితం’లో పృథ్వీరాజ్ అద్భుతమైన నటన మరియు అద్భుతమైన ఎడారి దృశ్యాలు ఉన్నాయి. కానీ ఇదొక ఆర్ట్ ఫిల్మ్. అద్భుతమైన ఉద్దేశాలు ఉన్నప్పటికీ, ఈ మనుగడ నాటకాన్ని చూడటానికి ఓపిక అవసరం ఎందుకంటే ఇది నెమ్మదిగా కదులుతుంది.
ఒక్క సారి చూడదగిన సినిమానే..
రేటింగ్: 2.75/5