Amaran మూవీ రివ్యూ : అమరన్.. హిట్టా..ఫట్టా?

Amaran

Amaran

Amaran : విభిన్నమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించడంలో కోలీవుడ్  ముందుంటుంది. హీరోయిజంతో పాటు మంచి కంటెంట్ అందించడంలో కోలీవుడ్ దే పై చేయి. తమిళం నుంచి ఇతర భాషల్లోకి ఎన్నో సినిమాలు రీమేక్ అయ్యాయి. అలాగే కొన్ని సినిమాలను ఇతర భాషల్లోకి డబ్ చేయగా సంచలన విజయాలను అందుకున్నాయి. భిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్న తమిళ హీరో శివ కార్తికేయన్ మరో వైవిధ్యమైన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే అమరన్. మరి ఆ సినిమా ఎలా ఉంది. ఆ సినిమా కథేంటి. ఆడియన్స్ ఏమంటున్నారో తెలుసకుందాం.

ఇదీ కథ
ఆర్మీ అధికారిగా దేశానికి ఎన్నో సేవలందించిన ముకుంద్ వరదరాజన్ ఆర్మీలో చేసిన ఆపరేషన్ ఏమిటి? అలాగే తన కుటుంబంతో ఎలా గడిపాడు.. ఆర్మీలో వరదరాజన్ సాధించిన విజయాలు ఏమిటి?  అనే కథాంశానికి కాస్త కల్పిత అంశాలను జోడిస్తూ ఈ సినిమాత తెరకెక్కింది. ముకుంద్ వరదరాజన్ ఆర్మీ ఆఫీసర్ సాధించిన విజయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

డైరెక్టర్ రాజకుమార్ పెరియాసామి మేజర్ ముకుంద్ వరద రాజన్ నిజజీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. క్యారెక్టరైజేషన్ లో ఎక్కడా పక్కదారి పట్టకుండా వాస్తవాలను అదే విధంగా తెర మీద చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు. ఇక మేజర్ అనగానే మనకు గుర్తు వచ్చేది శత్రువుల మీద చేసే వీరోచిత పోరాటమే. ఇక ఇందులో కొన్ని ఎలివేషన్ సీన్స్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. కథనంలో కూడా వైవిధ్యమైన అంశాలను స్పృశించాడు. డైరెక్టర్ మరి కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే కథనం మరింత ఆసక్తి కరంగా సాగేది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇంటెన్స్ డ్రామాను నడిపించాడు. చక్కటి భావోద్వేగాలతో ప్రేక్షకులను లీనం చేశాడనే చెప్పాలి.  ప్రథమార్థంలో యాక్షన్ పార్ట్ పై దృష్టి పెట్టాడు. ద్వితీయార్థంలో భావొద్వేగాలలను చక్కగా చూపించాడు.  ఆర్మీ అనగానే సగటు ప్రేక్షకుడికి ఏదో ఒక తెలియని కనెక్షన్ ఉంటుంది. మనందరి కోసం బార్డర్ లో యుద్ధం చేస్తున్న సైనికుల మీద మనకి ఎప్పుడూ గౌరవం ఉంటుంది. ఇదే అంశాన్ని ఎత్తుకొని ప్రేక్షకుడిని ఒక డిఫరెంట్ లోకంలోకి తీసుకెళ్లడంలో దర్శకుడు చాలా వరకు సఫలమయ్యాడు.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన బీజీఎం చాలా వరకు సినిమాను నిలబెట్టిందనే చెప్పాలి. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో ఆడియన్స్ తో కంటతడి పెట్టించడంలో జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన బీజీఎం వర్కౌట్ అయ్యింది. దర్శకుడు సినిమాను తెరకెక్కించిన  విధానం ఆడియన్స్ కి కొత్తగా అనిపిస్తుంది.

ఆర్టిస్టుల పర్ఫామెన్స్
హీరో శివ కార్తికేయన్ ఫెర్ఫామెన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా అది తక్కువనే చెప్పాలి. గత చిత్రాలకు మించి ఇందులో తన ఫెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు. ఇక అతని భార్య క్యారెక్టర్ లో సాయి పల్లవి చక్కగా పెర్ఫామ్ చేసింది. దేశం కోసం భర్త సరిహద్దుల్లో ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకునే విధానం, సోల్బర్ భార్యలో ధైర్యం గాని, ఆమె చెప్పే డైలాగులకు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. రాహుల్ బోస్, భువన్ అరోరా ల  ఫెర్ఫామెన్స్ కూడా సినిమాకు వందశాతం ఉపయోగపడింది. మిగిలిన పాత్రధారులు తమకున్న స్పేస్ ను చక్కగా వినియోగించుకున్నారు.

సాంకేతిక అంశాలు
సినిమాలో కథ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సిందే జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్  గురించే. సన్నవేశాలు, సందర్భానికి తగ్గట్లుగా మ్యూజిక్ ఇచ్చాడు. విజువల్స్ కూడా చాలా చక్కగా కుదిరాయి. సినిమాటోగ్రాఫర్ సీన్ మూడ్ పక్కదారిపట్టించకుండా మంచి విజువల్స్ కాప్చర్ చేశాడు. యుద్ధం నేపథ్యంలో సాగే సన్నివేశాల  విజువల్స్ అయితే అద్భుతం.

సానుకూలాంశాలు
కథ
శివ కార్తికేయన్, సాయి పల్లవి నటన
దర్శకత్వం

ప్రతికూలాంశాలు.
ద్వితీయార్థంలో స్లో నరేషన్.
కథనంనపై మరికాస్త కసరత్తు చేస్తే బాగుండేది

రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.85/5

చివరి లైన్
చాలా రోజుల తర్వాత వచ్చిన దేశభక్తి సినిమా.  తప్పకుండా చూడాల్సిన సినిమా.

TAGS