Mother Died : ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన తల్లి మృతి

Mother Died

Mother Died

Mother Died : తొలి కాన్పులోనే ముగ్గురు (ఇద్దరు మగ, ఒక ఆడ) శిశువులకు జన్మనిచ్చిన తల్లి అస్వస్థతకు గురై మృతి చెందింది. ఈ ఘటన పెనుకొండడ మండలం మోటువారిపల్లిలో చోటుచేసుకుంది. ఆమె భర్త గిరిరాజు తెలిపిన ప్రకారం.. మోటువారిపల్లికి చెందిన గిరిరాజుకు 2020, సెప్టెంబరు 18న కురుబవాండ్లపల్లికి చెందిన వెన్నెల (24)తో వివాహం జరిపించారు. ఆమె గత నెల 29న అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి అస్వస్థతకు గురైంది. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది.

ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారు. గురువారం మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చారు. బాలింత మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత గ్రామానికి వెళ్లి బాలింత మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

TAGS