JAISW News Telugu

OTT Films : ఓటీటీల్లో ఎక్కువ మంది చూస్తున్నవి ఇవే.. దుమ్మురేపుతున్న ‘శివన్న’ వెబ్ సిరీస్..

OTT Films

OTT Films, #90s A Middle Class Book

OTT Films : ఒకప్పుడు సినిమా అంటే ఓ సెలబ్రేషనే అని చెప్పాలి. సినిమాకు కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి శతదినోత్సవం జరిగే దాక ప్రతీ ఈవెంట్ ఫ్యాన్స్ కు ప్రత్యేకమే. గతంలో ఆడియో ఫంక్షన్ సైతం లక్షలాది మంది అభిమానులతో నిర్వహించేవారు. దీనికి ఓ డేట్ పెట్టి నెల రోజుల నుంచే అన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవారు. ఆడియో సూపర్ హిట్ అయితే.. ఎన్ని లక్షల క్యాసెట్లు అమ్ముడుపోయాయో అనేది కూడా రికార్డే. ఆ తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ అంటే ఒక పండుగే. సినిమా రిలీజ్ కు ముందు ఫ్యాన్స్ కు ఎన్నో పనులు. కటౌట్లు పెట్టడం, బ్యానర్లు రాయించడం, అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల కోసం బారులు తీరడం, సినిమా రీల్ బాక్సులకు పూజలు చేయడం..ఇలా సందడే సందడి.

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆ సందడంతా పోయింది. అప్పుడంటే జనాలకు ఎంటర్ టైన్ మెంట్ అంటే ఓన్లీ థియేటర్, టీవీ మాత్రమే. కొత్త సినిమా టీవీల్లో రావాలంటే రెండు, మూడు సంవత్సరాలు పట్టేది. అందుకే ఒక్కొక్క సినిమా సంవత్సరం కూడా ఆడేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. జనాలకు ఎంటర్ టైన్ మెంట్ వివిధ రకాలుగా అందుతోంది. వందలకు వందలు పెట్టి థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంట్లోనే సినిమాలను చూసుకునే సౌకర్యం వచ్చింది. దీంతో థియేటర్లలో సందడి తగ్గింది. ఒకప్పటి శతదినోత్సవాలు కరువై వారం, పది రోజులకే ఆటలు పరిమితమయ్యాయి.

ఇక ఓటీటీ ప్లాట్ ఫాంలకు జనాలు బాగా అడిక్ట్ అవుతున్నారు. వచ్చిన ఏ సినిమాను, వెబ్ సిరీస్ ను వదలిపెట్టడం లేదు. భాషతో సంబంధం లేకుండా అన్నీ చూసేస్తున్నారు. తాజాగా తెలుగు జనాలు ఎక్కువగా చూస్తున్న వాటిని ఒక్కసారి పరిశీలిద్దాం. శివాజీ నటించిన ‘90’ఎస్ మిడిల్ క్లాస్ బయోపిక్’ దుమ్మురేపుతోంది. దీన్ని జనాలు అత్యధికంగా చూస్తున్నట్టు వ్యూస్ ను బట్టి తెలుస్తోంది. దీనికి మరింత ఆదరణ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక దీని తర్వాత శ్రీకాంత్ ‘కోట బొమ్మాళి పీఎస్’, కల్యాణ్ రామ్ ‘డెవిల్’, నాని ‘హాయ్ నాన్న’, ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3’ని ఎక్కువగా తిలకిస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ‘ట్వెల్త్ ఫెయిల్’  దుమ్మురేపుతోంది.

Exit mobile version