AB Venteswara Rao : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి ఉదయం పోస్టింగ్.. సాయంత్రం రిటైర్మెంట్

AB Venteswara Rao

AB Venteswara Rao

AB Venteswara Rao :  ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఏబీవీపై ఉన్న సస్పెన్షన్‌ ను ప్రభుత్వం ఎత్తివేసింది.  ఆయనను సర్వీసులోకి తీసుకుంటున్నట్లు  సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పదవి కేటాయించారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ నేటితో ముగియనుంది.. సాయంత్రంతో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు.  2019 ఎన్నికల అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటుపడింది.. అప్పటి నుంచి ఆయనకు ఎలాంటి పోస్టింగ్ లేకుండా పోయింది.

ఈ క్రమంలోనే ఏబీవీ మాట్లాడుతూ.. బాధ్యతలు స్వీకరించిన రోజే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.  రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్‌ తీసుకుంటున్నా. నాకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు. ఇవాళ నా పదవీ విరమణ రోజు.. ఈ రోజే పోస్టింగ్‌ ఆర్డర్‌ తీసుకున్నా. సాయంత్రం పదవీ విరమణ చేసే అవకాశం  నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్‌ ఈజ్‌ వెల్‌ అని భావిస్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాను. ప్రస్తుతం ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు.  పోస్టింగ్‌ ఆర్డర్లు వచ్చాయి.. విధుల్లో చేరాను. ఇప్పటికీ ఇంత వరకు మాత్రమే మాట్లాడగలను. ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటాను.  యూనిఫాంతో పదవీ విరమణ చేయడం నా కల.. ప్రస్తుతం ఇది నెర వేరినట్లుగా భావిస్తున్నా’’ అన్నారు.    ఏబీవీపై సర్కార్  విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఎత్తివేసింది.

TAGS