JAISW News Telugu

Australia : ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ మంది ఒక్క రోజు రైలు ప్రయాణం..

Australia

Australia

Australia Population : భారత రైల్వే వ్యవస్థ అత్యంత పెద్దది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదిగా గుర్తింపు పొందింది. లోకల్, నాన్ లోకల్, సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ ఇలా చాలా రైళ్లు ప్రతీ రోజు ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తాయి. పండుగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో అయితే రద్దీ మరింత పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగా శాఖ రైళ్లను నడుపుతుంది. ఎక్కువ దిగువ, మధ్య తరగతి ప్రజలు అధిక ఆర్థిక భారం తగ్గించుకునేందుకు రైలు ప్రయాణాన్నే ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త రైళ్లలో ప్రయాణం కాస్ట్లీగా మారినా.. సంప్రదాయ రైళ్లను సైతం శాఖ నడిపిస్తోంది. రైలు ప్రయాణం, గమ్య స్థానం, సమయం ఇలా ప్రతీ అంశం తెలుసుకునేందుకు రైల్వే డిపార్ట్ మెంట్ ఒక యాప్ ను తీసుకువచ్చింది అదే ‘ఐఆర్‌సీటీసీ’. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ నుంచి రైలు ఎక్కి దిగే వరకు చాలా వసతులను కల్పిస్తుంది. ఐఆర్‌సీటీసీ ఇటీవల ఒక రికార్డు క్రియేట్ చేసింది. ఒక దేశ జనాభాకు మించిన మందిని ఒక్క రోజులో రావాణా చేసినట్లు చెప్పింది. నవంబర్ 4వ తేదీ ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకున్న 3 కోట్ల మందిని వారి గమ్య స్థానాలకు చేర్చింది. అయితే ఇది టికెట్ తీసుకున్న వారి సంఖ్య కాకుండా ఒక్క ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకున్న వారు మాత్రమే. ఇది ఆస్ట్రేలియా జనాభా కంటే కూడా అధికం కావడం విశేషం.
Exit mobile version