JAISW News Telugu

Lokesh Yuvagalam : ‘యువగళం’కు మరింత జోష్.. లోకేశ్ తో నడిచేందుకు ఎగబడుతున్న యువత..

Lokesh Yuvagalam

Lokesh Yuvagalam

Lokesh Yuvagalam : తెలుగుదేశం పార్టీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రను రీస్ట్రాట్ చేశారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం పొదలాడ నుంచి యాత్ర ఈ రోజు (నవంబర్ 27) ప్రారంభమైంది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత, ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్టయిన నేపథ్యంలో 79 రోజుల క్రితం లోకేష్ తన యాత్రను విరమించుకున్నారు. చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ క్యాడర్ లో ఉత్సాహం పెరిగింది. మరింత ఉత్సాహంతో లోకేష్, పార్టీ క్యాడర్ ఇప్పుడు కోనసీమ జిల్లాలను చుట్టి ఆ తర్వాత ఉత్తరాంధ్ర వైపు పయనించనున్నారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులోనూ చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం అనేక ఆరోపణలు చేసింది. చంద్రబాబుపై అభియోగాలు మోపిన సీఐడీ రెండు నెలలు కేసులను లాగుతూ సాక్ష్యాధారాలను డాక్యుమెంట్ల రూపంలో సమర్పించింది. అయితే స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి నిధుల దుర్వినియోగానికి చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో మిగిలిన నిందితులంతా గతంలోనే బెయిల్‌పై బయటకు రావడం గమనార్హం.

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో లోకేశ్‌ను ఏ-14గా సీఐడీ అభియోగాలు మోపింది. ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో కూడా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. రెండు నెలల క్రితం ఆయనను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరిగినా లోకేష్ కు ముందస్తు బెయిల్ లభించింది.

తనపై, తన తండ్రిపై నమోదైన అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు లోకేశ్ కొంత కాలం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. అనారోగ్య కారణాలతో బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబుకు టీడీపీ క్యాడర్ భారీగా స్వాగతం పలికింది. క్యాడర్ నుంచి వస్తున్న భారీ స్పందన నేపథ్యంలో టీడీపీ నేతలు జోరుగా ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ లో కూడా మార్పులు చేసినట్లు సమాచారం. ముందుగా అనుకున్నట్లుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి లోకేష్ తన యాత్రను విశాఖలో ముగించే ఆలోచనలో ఉన్నారు. లోకేష్ యాత్ర తుని మీదుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే తన యాత్ర ముగించాలని లోకేష్ అనుకుంటున్నారు.

తనకు, తన తండ్రికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. రెండు పార్టీలు పొత్తులో ఉన్నందున పాదయాత్రకు జనసేన నుంచి భారీ మద్దతు ఉంటుందని చెప్పక తప్పదు. జనవరి 27న పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ 2 రోజుల్లో 852,4.208 కిలో మీటర్లు ప్రయాణించారు. ఈ యాత్రలో భాగంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని 84 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించిన ఆయన 66 చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించారు.

Exit mobile version