The Legend of Hanuman:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దర్శకుడు ఓంరౌత్ వైపే అన్ని వేళ్లు చూపించాయి. ఆ తర్వాత అతడు అండర్ గ్రౌండ్ కి వెళ్లాడంటూ సెటైర్లు వినిపించాయి. ఆదిపురుష్ లో పాత్రల హావభావాలు ప్రవర్తనలు, అలాగే వాటి సంభాషణల విషయంలో తప్పులు విమర్శలకు కారణమయ్యాయి.
అయితే రామాయణం కథతోనే ఇప్పుడు వరుసగా సినిమాలు వస్తున్నాయి. ఓవైపు నితీష్ తివారీ రామాయణం ఆధారంగా భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుక సన్నాహకాల్లో ఉండగా, ఇప్పుడు ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ పేరుతో యానిమేటెడ్ మూవీ విడుదలవుతోంది. అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ పౌరాణిక ధారావాహిక మూడవ సీజన్‌ను ప్రారంభించనున్నారు. ఇది అభిమానులను ఆనందపరిచే వార్త. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగా ఉండటమే కాకుండా యానిమేటెడ్ కంటెంట్‌లో శ్రేష్ఠతకు కొత్త ప్రమాణాన్ని సెట్ చేసిందని ప్రశంసలు దక్కుతున్నాయి.
శక్తివంతమైన సూపర్ హీరో హనుమంతుని ఆకర్షణీయమైన పాత్ర ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. శరద్ కేల్కర్ రావణుడి పాత్రకు వాయిస్‌ఓవర్ అందించగా అది అభిమానులను విస్మయానికి గురి చేసింది. సీతను తన బారి నుండి విముక్తి చేయడానికి రాముడు ఒక గొప్ప మిషన్‌ను ప్రారంభించనుండగా, రావణుడు నమ్మకంగా ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు సిద్ధమవ్వడంతో ట్రైలర్ ఆసక్తిని కలిగించింది. హనుమంతుని పరాక్రమానికి సంబంధించిన సన్నివేశాల్ని యానిమేషన్ లో అద్భుతంగా చూపారు.
రావణ రాజ్యంలో రాక్షసులు, కుంభకర్ణుడి ఉనికిని ట్రైలర్ లో చూపిన విధానం ఆకట్టుకుంది. 12 జనవరి 2024న ఈ యానిమేటెడ్ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది. తాజా ట్రైలర్ ని వీక్షించిన చాలా మంది అభిమానులు ఆదిపురుష్ కంటే బావుందంటూ ప్రశంసిస్తున్నారు.శరద్ దేవరాజన్, జీవన్ జె. కాంగ్, చారువి అగర్వాల్‌ల నిర్మాణ సహకారంతో రూపొందిన సిరీస్ ఇది. 29 జనవరి 2021న ప్రారంభమైన ఈ సిరీస్ ని గ్రాఫిక్ ఇండియా రూపొందిస్తోంది. రెండో సీజన్ అధికారికంగా 27 జూలై 2021న ప్రకటించగా, మేకింగ్ క్వాలిటీ జనరంజకంగా కుదిరింది. గొప్ప జనాదరణ పొందింది. ఇప్పుడు మూడో సీజన్ విడుదలకు రానుంది.