JAISW News Telugu

Maruti Suzuki : మరింత దూకుడుగా మారుతీ సుజుకీ.. ఏడాదిలోనే 21.35 కార్లు సేల్.. 

Maruti Suzuki

Maruti Suzuki

Maruti Suzuki : మారుతీ సుజుకీ 2023-24 సంవత్సరానికి గానూ 2,135,323 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇందులో దేశీయ విక్రయాలు 1,793,644 యూనిట్లు కాగా, ఎగుమతులు 283,067 యూనిట్లు ఉన్నాయి. ఇందులో SUVలో పెరుగుదల, హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌ల క్షీణత కనిపించింది. మారుతీ సుజుకీలో అమ్మకాల పరంగా Wagon R అత్యధిక సేల్స్ నమోదు చేసింది. కాంపాక్ట్ సెగ్మెంట్ 2023తో పోలిస్తే 2024లో స్వల్పంగా క్షీణించింది. SUV మార్కెట్ వేగంగా పెరుగుతోంది. గ్రాండ్ విటారా, ఫ్రాంటెక్స్, బ్రెజ్జా ఇతర మోడళ్ల కారణంగా 2023 నుంచి యుటిలిటీ వాహనాల అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

SUVలో పెరిగిన అమ్మకాలు..
మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు శశాంక్ శ్రీవాస్తవ ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. పట్టణ వృద్ధిని బట్టి చూస్తే గ్రామీణ వృద్ధి పెరుగుదల నమోదు చేసిందని, SUV విభాగంలో మారుతీ సుజుకీ మార్కెట్ వాటా 21 శాతానికి పెరిగింది. ఇతర ధోరణుల్లో డీజిల్ కార్ల అమ్మకాలు కూడా క్షీణించాయి. CNG స్పేస్ వృద్ధిని నమోదు చేసింది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ స్పేస్‌లో, హైబ్రిడ్లు తక్కువ ఆఫర్ చేసినప్పటికీ EVలను అధిగమించాయి. మారుతీ సుజుకీ ప్రస్తుతం ఇన్విక్టో, గ్రాండ్ విటారా వంటి హైబ్రిడ్ కార్లను కలిగి ఉండగా, తన మొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నాహకంగా రెండు సెగ్మెంట్లలోకి ప్రవేశిస్తుందని చెప్పారు.

జపాన్‌ను అధిగమించిన కార్ల మార్కెట్..
భారతీయ కార్ల మార్కెట్ సంఖ్యా పరంగా జపాన్‌ను అధిగమించింది. ఇందులో SUV స్టైలింగ్ ప్రధాన విభాగంగా ఉంది. MPVలు కూడా పెద్ద వృద్ధిని సాధించాయి. అందువల్ల, సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్‌ ఎంపిక క్షీణించడంతో, SUV, MPV ప్రముఖ ఎంపికలుగా కనిపించాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మారుతీ సుజుకీ పోర్ట్‌ ఫోలియోలో నాలుగు నెలల వెయిటింగ్ పీరియడ్‌తో ఎర్టీగా ఎక్కువ కాలం వేచి ఉన్న కారు. గ్రాండ్ విటారా వంటి ప్రముఖ SUV కూడా ఎక్కువ వెయిటింగ్ పీరియడ్‌ కలిగి ఉన్నాయి.

కంపెనీ ప్లాన్ ఏంటి?
శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ‘2030 నాటికి మారుతీ సుజుకీ ఉత్పత్తులు 15 శాతం EV 25 శాతం ఉంటుందని, మిగిలినవి పెట్రోల్, CNG ఉత్పత్తులు ఉంటాయని తెలిసిందే.. మారుతీ సుజుకీ ఇటీవల నాయకత్వ మార్పులను ప్రకటించింది. CV రామన్, శశాంక్ శ్రీవాస్తవ మునుపటి పాత్రల నుంచి ‘మెంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ’కి బదిలీ అయ్యరు. గతంలో హెడ్-సర్వీసెస్‌గా ఉన్న పార్థో బెనర్జీ ఇప్పుడు హెడ్-మార్కెటింగ్, విక్రయాల్లో ఉన్నారు. సందీప్ రైనా ప్రొడక్ట్ స్కీమ్ చీఫ్‌గా ఉన్నారు.  

Exit mobile version