JAISW News Telugu

KTR : కమీషన్ల కోసమే మూసీ సుందరీకరణ: కేటీఆర్

KTR

KTR

KTR : కమీషన్ల కోసమే రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ చేపట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మూసీ పేరు మీద రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రాలు డబ్బులు పంచుకుంటారని వ్యాఖ్యానించారు. రుణమాఫీ కోసం రైతులు జిల్లా కలెక్టర్లను కలవాలని సీఎం రేవంత్ చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రజలు కలెక్టర్లకు ఓట్లు వేయలేదు. ఓట్లు వేసింది కాంగ్రెస్ అభ్యర్థులకని కేటీఆర్ పేర్కొన్నారు.

రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ లో రైతుల భూములను ప్రభుత్వం గుంజుకుంటోందని ఆరోపించారు. రైతుల పక్షాన పాదయాత్ర చేస్తున్న పట్నం నరేంద్ర రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తన్నామని కేటీఆర్ అన్నారు. రేవంత ముందు ఆయన సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని విమర్శించారు. ప్రజాభిప్రాయంతో కొడంగల్ ప్రజలను ఒప్పించి భూములను తీసుకోవాలన్నారు.

Exit mobile version