AP Politics : సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది.. ఇది ఆంధ్రాలో పెత్తనం
AP Politics : కష్టపడి సంపాదించుకొన్న సొమ్మును అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటది. కానీ ఆ సొమ్మును దొడ్డి దారిన తీసుకొని అనుభవించే వారు కూడా ఎక్కువై పోయారు. ఇది ఎక్కడో కాదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తీరుచూసి ప్రజలు అసహ్యించు కుంటున్నారు.రెండోసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్ కోరిక తీరింది. ఆయనే సీఎం గా ప్రమాణస్వీకారం చేశాడు. దీంతో ప్రజలు ఆయన పరిపాలనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక మా ఆస్తులకు, మా ప్రాణాలకు గ్యారంటీ ఇచ్చే నాయకుడు వచ్చాడు అని తెగ సంబరపడిపోయారు. కానీ ఆ ఆశలు ఎన్నో రోజులు నిలువ లేదు. ప్రజల ప్రాణ,ఆస్తులకు రక్షణ కాదు, ప్రభుత్వ ఆస్తులకే రక్షణ లేకుండా పోయింది. దీనితో ఆశపడిన ప్రజలు నిరాశతో ఉన్నారు. నిరాశతో ఉన్న ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఆశ్చర్య పోయే విషయాన్నీ ప్రజల ముందు తెచ్చేందుకు సిద్ధమైంది.
ఇప్పటి నుంచి ప్రజలు సంపాదించుకొన్న సొంత ఆస్తులపై వారికి ఉన్న హక్కులను వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రయత్నంలో ఉందని జనసేన,టీడీపీ నాయకులు తమ ప్రచారంలో ఆరోపిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని జగన్ ప్రభుత్వం తయారు చేసి సిద్ధంగా ఉంచిందని కూటమి నాయకులు చేస్తున్న ప్రచారంతో ఎవరికీ మేలు జరుగుతుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం కావడం విశేషం. ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలపై వైసీపీ కి సంబంధించిన రంగులు వేయించారు. విద్యార్థుల పుస్తకాలపై జగన్ ఫొటోను ముద్రించారు. జైలుకు వెళ్లి వచ్చిన నాయకుడి బొమ్మ పెట్టిన మీరు ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు వైసీపీ నేతలకు.
అదే విధంగా రైతుల ఆస్తులకు సంబంధించిన పట్టా పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ముద్రించి పెట్టారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్ భార్య భారతి రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తాము సంపాదించుకున్న ఆస్తి కి సంభందించిన పత్రాలపై జగన్ బొమ్మ ఎందుకు పెట్టారు. ఇంతకూ మా ఆస్థి మాదా, మీదా అంటూ ప్రశ్నించారు. దీంతో ఖంగుతిన్న ఆమె అక్కడి నుంచి జారుకోక తప్పలేదు. ఇలాంటి వాటిని కూటమి నేతలు ఆయుధంగా మార్చుకొని దాడులు చేస్తుంటే, వైసీపీ నేతలకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందనేది ప్రజలకు కూడా తెలిసి పోయింది.